‘బాహుబలి’ షూటింగ్‌లో ప్రమాదం..!
on Oct 13, 2014
.jpg)
ప్రభాస్,రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘బాహుబలి’ చిత్రం షూటింగ్‌లో అపశ్రుతి చోటుచేసుకొంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫైట్ సన్నివేశాలను రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా తెరకేకిస్తున్నారు రాజమౌళి. అయితే శనివారం ఈ ఫైట్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా భారీ స్థాయిలో కుంకుమను వెదజల్లేందుకు పేలుడు పదార్థాలను ఉపయోగించారు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనే వున్న ఫైటర్లలలో కొంతమందికి ఈ మంటల వల్ల స్వల్పగాయాలయ్యాయి. వెంటనే వారిని హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. వారికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో యూనిట్ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



