'బీబీ3' బ్యాక్‌డ్రాప్‌ను మారుస్తున్నారా?
on Aug 7, 2020
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూడో సినిమా నిర్మాణంలో ఉంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఆ మూవీని మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా బోయపాటి రూపొందిస్తున్నాడు. హీరోయిన్లు ఖాయం కాకపోయినా ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ జరిపారు. ఆ తర్వాత కరోనా మహమ్మారి దెబ్బతో షూటింగ్ అనివార్యంగా వాయిదా పడింది. అయినప్పటికీ జూన్‌లో బాలయ్య బర్త్‌డేకి ఫ్యాన్స్‌ను సంబరాల్లో ముంచెత్తుతూ టీజర్ రిలీజ్ చేశారు. దానికి అన్ని సెక్షన్ల నుంచీ మంచి రెస్పాన్స్ వచ్చింది. 'సింహా', 'లెజెండ్' వంటి సూపర్ హిట్స్ తర్వాత హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ రానున్నదనే నమ్మకాన్ని ఆ టీజర్ కలిగించింది.
ఆ సినిమాకు సబంధించి ఓ కీలక ఘట్టాన్ని ఉత్తర భారతంలో చిత్రీకరించాలని బోయపాటి భావించాడు. కానీ ఇప్పుడది రిస్క్‌తో కూడుకున్న విషయం కాకపోవడంతో స్క్రిప్ట్‌లో మార్పులు చేయమనీ, ఆ కీలక ఘట్టం బ్యాక్‌డ్రాప్‌ను తెలుగు ప్రాంతానికి మార్చమనీ డైరెక్టర్‌కు సూచించినట్లు ప్రచారంలోకి వచ్చింది. దానికి తగ్గట్లుగా స్క్రిప్టును మారుస్తున్నారంట. 'మోనార్క్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ మూవీలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అందులో ఒకటి అఘోరా క్యారెక్టర్.