రానాని బ్రదర్ అని..ప్రభాస్‌ని ఏమీ అనలేదంటే అనుష్క మనసులో..?
on May 18, 2017

బాహుబలి ప్రాజెక్ట్ ముగిసింది..అందరూ భావించినట్లే ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో చరిత్ర సృష్టించింది. ఇక అందరి చూపు పెళ్లి గురించే. ఎవరి పెళ్లో ప్రత్యేకంగా చెప్పేదేముంది. ప్రభాస్ ఆ తర్వాత అనుష్కలు మీ పెళ్లి ఎప్పుడు అంటే బాహుబలి అవ్వనివ్వండి చూద్దాం అని మీడియా నోటికి తాళం వేశారు. ప్రభాస్, అనుష్కల మధ్య ఏదో ఉందని..ఇద్దరి మధ్య ఎప్పుడో ప్రేమ చిగురించిందని..హైట్, ఫిజిక్‌లో ఒకరికొకరు సరైన జోడీ అని వీరిద్దరూ ఒక్కటైతే బాగుంటుందని చాలా మంది పబ్లిగ్గానే అంటున్నారు. కానీ ఇంతవరకు తమ మధ్య ఎఫైర్ ఉందని కానీ.. లేదని కానీ చెప్పలేదు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌పై స్వీటీ చేసిన కామెంట్స్ ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
బాహుబలి-2 ప్రమోషన్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ అనుష్కను ఓ ప్రశ్న అడిగింది. ప్రభాస్, రానాల్లో ఎవరు అందగాడు అని ప్రశ్నించగా..ఏ మాత్రం ఆలోచించకుండా ప్రభాస్ అని టక్కున చెప్పేసింది. మరి రానా పరిస్ధితి ఏంటీ అనగా..రానా తనకు సోదరుడి లాంటి వాడని..నేను బ్రదర్ అని పిలుస్తానని, రానా కూడా తనను సోదరిలాగే చూస్తాడని చెప్పుకొచ్చింది. అంటే తన ఉద్దేశం ఏంటో అనుష్క చెప్పకనే చెప్పిందని ఫిలింనగర్‌లో చెవులు కొరుక్కుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



