మూడు రోజుల్లో 500 కోట్లు కొట్టిన బాహుబలి..? ఎక్కడ నుంచి ఎంత..?
on May 2, 2017
బాహుబలి ద కన్‌క్లూజన్, బాహుబలి-2 ఎలా పిలుచుకున్నా సరే..దేశంలో ఇప్పుడు పెద్ద పెద్ద విషయాలన్నింటిని పక్కనబెట్టి బాహుబలి గురించే చర్చ. రిలీజైన తర్వాత ఖచ్చితంగా కోట్లు కొల్లగొడుతుందని తెలుసు. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజు 120 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఇప్పుడు అదే జోష్‌ను కంటిన్యూ చేస్తూ..మూడు రోజుల్లోనే 500 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. ఈ మూడు రోజుల్లో తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో..దాదాపు 420 కోట్లకు పైగా వసూలు చేయగా..నార్త్ అమెరికాలో ఇప్పటికే 65 కోట్లు..యూఏఈలో మరో 20 కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అదే గనుకు నిజమైతే కేవలం మూడు రోజుల్లోనే 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన తొలి సినిమాగా బాహుబలి రికార్డుల్లోకి ఎక్కినట్లే. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే అతి త్వరలో వెయ్యి కోట్లు వసూలు చేసి కొత్త బెంచ్ మార్క్ సృష్టించడం ఖాయమని చెప్పవచ్చు.
Also Read