Home

»

Latest News

విక్రమ్ తో రవితేజ సినిమా ఫైనల్ అయ్యింది!

Jul 19, 2016 10:12AM

"బెంగాల్ టైగర్" సినిమా విడుదలై ఎనిమిది నెలలు పూర్తి కావస్తోంది. ఆర్భాటంగా మొదలెట్టిన సినిమా ఆగిపోయింది. ఇంకో రెండు సినిమాలు ఎనౌన్స్ అయినప్పటికీ కార్యరూపం దాల్చకముందే ఆగిపోయాయి. మొన్నామధ్య "పవర్" ఫేమ్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా అంటూ వార్తలొచ్చినప్పటికీ.. అందులో వాస్తవం ఎంతో, అది ఎప్పటికి కార్యరూపం దాల్చుతుందో తెలియదు. దాంతో ఇక 2016లో రవితేజను వెండితెరపై చూడడం కష్టమే అని రవితేజ అభిమానులందరూ ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే.. ఇప్పటికిప్పుడు ఏదో ఒక సినిమా మొదలెట్టినప్పటికీ.. ఆ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, రిలీజ్ అవ్వడం ఇవన్నీ జరగాలంటే తక్కువలో తక్కువ 8 నుంచి 10 నెలల సమయం కావాలి. అదన్నమాట సంగతి. ఇక తాజా సమాచారం ఏంటంటే రవితేజ మరో కొత్త దర్శకుడ్ని పరిచయం చేయనున్నాడని తెలుస్తోంది. "మిరపకాయ్" చిత్రానికి రైటర్ గా వర్క్ చేసిన విక్రమ్ చెప్పిన కథను మెచ్చిన రవితేజ అతనికి దర్శకుడిగా అవకాశమిచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశాడట. నల్లమలుపు బుజ్జి నిర్మించనున్న ఈ సినిమా అన్నీ అనుకొన్నట్లుగా జరిగితే వచ్చే నెల నుంచే సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com