Home

»

Latest News

ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోన్న "జనతా గ్యారేజ్"

Jul 19, 2016 10:23AM

మొన్నటివరకూ సినిమా విడుదలై రెండు రోజులకో లేక మూడు రోజులకో సినిమా పైరసీ అవ్వడం మామూలే. నిర్మాతలు కూడా పోరాడిపోరాడి అలిసిపోయి సైలెంట్ అయిపోయారు. కానీ.. ఇప్పుడు ఏకంగా సినిమా విడుదలకు ముందే పైరసీ పేట్రేగిపోతోంది. హిందీలో "ఉడ్తా పంజాబ్, గ్రేట్ గ్రాండ్ మస్తీ" చిత్రాలు విడుదలకు వారం రోజుల ముందే పైసరీ ప్రింట్ ఇంటర్నెట్ లో ప్రత్యక్షం అయ్యింది. ఇప్పుడు అదే తరహాలో ఎన్టీయార్ తాజా చిత్రం "జనతా గ్యారేజ్"లోని ఒక పాట ప్రస్త్తుతం ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. "దివి నుంచి దిగివచ్చావా యాపిల్ బ్యూటీ.." అనే పల్లవితో సాగే ఈ పెప్పీ ట్యూన్ ను దేవిశ్రీప్రసాద్ పాడాడు.  అయితే.. ఇది నిజంగా లీక్ అయిన పాట లేక "ఆర్య 2" తరహాలో కావాలనే ఆడియన్స్ రెస్పాన్స్ కోసం ఈ రఫ్ ట్రాక్ ను రిలీజ్ చేసి లీకైనట్లుగా బిల్డప్ ఇస్తున్నారా? అనేది తెలియాల్సి ఉండగా.. నందమూరి అభిమానులు మాత్రం "పాట సూపర్" అంటూ అప్పుడే ఆడియో సక్సెస్ సెలబ్రేషన్స్ కు శ్రీకారం చుట్టేస్తున్నారు!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com