Home

»

Latest News

ఫ్యాషన్ డిజైనర్ గా మారిన దగ్గుబాటి హీరో!

Jul 19, 2016 9:59AM

"ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21F" లాంటి వరుస విజయాలతో హీరోగా హ్యాట్రిక్ సక్సెస్ అందుకొన్న రాజ్ తరుణ్ టైటిల్ పాత్రలో "లేడీస్ టైలర్" సినిమాకు సీక్వెల్ గా "ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్" చిత్రాన్ని నిర్మిద్దామనుకొన్నారు దర్శకనిర్మాత మధుర శ్రీధర్. "లేడీస్ టైలర్" రూపకర్త వంశీ ఈ సీక్వెల్ కు కూడా దర్శకత్వం వహించనున్నారని వార్తలొచ్చాయి. అయితే.. రాజ్ తరుణ్ సహకరించకపోవడంతో ఆ ప్రోజెక్ట్ ఆగిపోయింది. అయితే.. రాజ్ తరుణ్ తో అనుకొన్న అదే సినిమాను ప్రఖ్యాత నిర్మాత రామానాయుడు రెండో మనవడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా తీద్దామని సన్నాహాలు జరుగుతున్నాయట. పెద్ద వంశీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో కొత్త నిర్మాతలు నిర్మిస్తారని వినికిడి. ఇప్పటికే అన్నయ్య రాణా హీరోగా, విలన్ గా తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరు తెచ్చుకోగా ఇప్పుడు తమ్ముడు సన్నద్ధమవుతున్నాడు. చూద్దాం మరి దగ్గుబాటి అబ్బాయి ఫ్యాషన్ డిజైనర్ వేషాలు జనాలకు నచ్చుతాయో లేదో!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com