తెలుగునాట 'అవతార్ 2' రికార్డ్ బ్రేక్ ఓపెనింగ్స్
on Dec 17, 2022
![]()
జేమ్స్ కామెరాన్ ఎపిక్ మూవీ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' ప్రపంచవ్యాప్తంగా సంచలనాత్మక కలెక్షన్స్ రాబడుతోంది. తెలుగు రాష్ట్రాలు కూడా అందుకు మినహాయింపు కాదు. అంచనాలకు అనుగుణంగా తొలిరోజు భారీ వసూళ్లను సాధించింది. మునుపు హాలీవుడ్ బిగ్ ఫిలిమ్స్ 'స్పైడర్‌మేన్ నో వే హోమ్' (రూ. 5.50 కోట్ల గ్రాస్), 'అవెంజెర్స్ ఎండ్ గేమ్' (రూ. 5 కోట్ల గ్రాస్) రెండింటిని కలిపినా.. అంతకంటే మించి 'అవతార్ 2' భీకరమైన వసూళ్లతో అదరగొట్టింది.
ఆంధ్రాలో రూ. 4.80 కోట్లు, తెలంగాణలో రూ. 7.05 కోట్లు, రాయలసీమలో రూ. 1.80 కోట్లు.. వెరసి రూ. 13.65 కోట్ల గ్రాస్ కలెక్షన్‌తో ఈ పండోరా మూవీ ప్రభంజనం సృష్టించడంతో ఆశ్చర్యపోవడం విశ్లేషకుల వంతు.
తెలుగునాట ఈ మూవీని హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలే సొంతంగా రిలీజ్ చేశాయి. దాంతో ఈ ప్రాంతంలో ఈ మూవీ బిజినెస్ వాల్యూ ఎంతనేది ఇంకా వెల్లడి కాలేదు. ఓపెనింగ్స్ విషయంలో హాలీవుడ్ మూవీస్‌కు సంబంధించినంత వరకు తెలుగు రాష్ట్రాల్లో 'అవతార్ 2'దే రికార్డ్.
13 సంవత్సరాల క్రితం వచ్చిన 'అవతార్' మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' మూవీలో సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, స్టీఫెన్ లాంగ్, సిగౌర్నీ వీవర్, కేట్ విన్‌స్లెట్ ప్రధాన పాత్రలు పోషించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



