
నిన్న హైదరాబాద్(Hyderabad)సమీపంలోని బొంగులూరు గేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో యువ హీరో భరత్ కాంత్(Bharath Kanth)మృతిచెందాడు. నెల్లూరు నుంచి హైదరాబాద్ కి వస్తుండగా ఘటన జరిగింది. ఊహించని ఈ సంఘటనతో అభిమానులు, సినీ ప్రముఖులు విషాద వదనంలో మునిగిపోయారు. రీసెంట్ గా భరత్ కాంత్ మృతిపై ప్రముఖ నటి అషురెడ్డి(Ashu Reddy)సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది. సదరు పోస్ట్ ఇప్పుడు పలువురి హృదయాల్ని తాకుతుంది.
ఇనిస్టా వేదికగా అషురెడ్డి స్పందిస్తు 'నీ మరణ వార్తని నమ్మలేకపోతున్నాను. ఇది నిజం కాకూడదు. మనం కలిసి గడిపిన క్షణాలు, నువ్వు నాపై చూపించిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరదు. ఎప్పటికీ నా గుండెల్లో జీవించే ఉంటావు 'అంటూ తన బాధని వ్యక్తపరిచింది. భరత్‌తో దిగిన కొన్ని ఫోటోలని , వీడియోలని కూడా షేర్ చేయడంతో ఇప్పుడు అవి వైరల్ గా నిలిచాయి
Also read: Rashmi Gautam: రాజకీయం వేరు,మానవత్వం వేరు.. మోదీపై రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు
భరత్ కాంత్ ఇటీవల విడుదలైన 'టాలెంట్' సినిమాలో హీరోగా మంచి గుర్తింపు పొందటంతో పాటు పలు తెలుగు, హిందీ వెబ్ సిరీస్‌లలో చేసాడు. ఇదే ప్రమాదంలో సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ కూడా చనిపోవడం జరిగింది. పలు తెలుగు సినిమాలకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నాడు.






