Home

»

Latest News

Rashmi Gautam: రాజకీయం వేరు,మానవత్వం వేరు.. మోదీపై రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు

May 11, 2026

 

 

మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను. ఈ విషయంలో ఎవరి డాం బికాలకి, బెదిరింపులకి తలొగ్గే ప్రసక్తే లేదు అంటు రష్మీ ఈ మధ్య కాలంలో తన భావ  జాలాన్ని చాలా బలంగానే చాటుతూ వస్తుంది. రీసెంట్ గా జంతువుల హక్కుల కోసం తన గళాన్ని విప్పిన రష్మీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి  సంబంధించిన విషయంపై మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. ఆ డీటెయిల్స్ చూద్దాం.


ఇటీవల దేశంలో చోటుచేసుకున్న కొన్ని దారుణమైన ఘటనలు, మహిళలపై జరుగుతున్న అకృత్యాల నేపథ్యంలో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో రష్మీని టార్గెట్ చేస్తూ కొందరు నెటిజన్లు ఆమె రాజకీయ మద్దతుపై విమర్శలు చేశారు. ప్రధాని మోదీకి మద్దతు తెలిపే రష్మీ, ప్రస్తుత పరిస్థితులపై ఎందుకు స్పందించడం లేదంటూ ట్రోల్స్ మొదలుపెట్టారు. వీటికి రష్మీ తనదైన శైలిలో ఘాటుగా సమాధానమిచ్చారు. ఎక్స్ వేదికగా స్పందిస్తు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరియు బిజెపి సిద్ధాంతాలకి మద్దతు ఇస్తున్నాను. అది నా వ్యక్తిగత ఇష్టం మరియు దేశాభివృద్ధి పట్ల నాకున్న నమ్మకం. మోదీకి మద్దతు ఇవ్వడం అంటే నేరస్థులని, మనిషి రూపంలో ఉన్న మృగాలని, రేపిస్టులని, లైంగిక వేధింపులకి గురి చేసే వారిని సమర్థించడం కాదు. బూతులతో కూడిన పోస్టులకి నేను స్పందించను. రిప్లై కూడా  ఇవ్వను. ఈ విషయాన్ని నేను పదేపదే చెప్తూ వస్తున్నాను. నేను సమస్యలపై కేవలం సానుభూతి మాత్రమే చూపగలను. కానీ వాటన్నిటి కోసం పోరాడలేను.


Also read: Vishwambhara: రెండు భాగాలుగా విశ్వంభర.. కన్ఫర్మ్ చేసిన దర్శకుడు 

మానవ సంబంధిత సమస్యలను ప్రశ్నించడం కోసం ఎన్నో గొంతులు ఉన్నాయి. నేను గొంతులేని వారికి అండగా నిలబడి, నిరంతరం సహాయం చేస్తాను. వారికి అండగా ఉంటాను. నన్ను దూషించడంలో మీ ఎనర్జీని వృధా చేయకండి. అదే ఎనర్జీని ప్రభుత్వం  న్యాయవ్యవస్థ  సరైన వ్యక్తులని ట్యాగ్ చేయడానికి, వారి నుండి న్యాయం కోరడానికి ఉపయోగించండి. నేను పోస్ట్ చేయడం వల్ల ఎలాంటి మార్పు రాదు. నటీనటులని ట్యాగ్ చేయడం ఫ్యాషన్‌గా ఉండొచ్చు.  కానీ దాని వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు  అని యాంకర్ రష్మి గౌతమ్ పోస్ట్ పెట్టింది.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com