'ఆహా'లో 'అర్జున కళ్యాణం'.. ముహూర్తం ఎప్పుడంటే?
on May 27, 2022
యంగ్ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ మూవీ 'అశోక వనంలో అర్జున కళ్యాణం'. విద్యా సాగర్ చింత డైరెక్ట్ చేసిన ఈ సినిమా మే 6న విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. విశ్వక్ సేన్ అద్భుత నటన, సహజమైన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.
'అశోక వనంలో అర్జున కళ్యాణం' విడుదల సమయానికి థియేటర్స్ లో 'కేజీఎఫ్-2' ప్రభంజనం కొనసాగుతోంది. దానికి తోడు విడుదలైన ఆరు రోజులకే 'సర్కారు వారి పాట' విడుదలైంది. దీంతో అర్జున కళ్యాణం కలెక్షన్ల పై తీవ్ర ప్రభావం పడింది. లేదంటే ఈ సినిమా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి ఇంకా పెద్ద హిట్ గా నిలిచేది. థియేటర్స్ లో చూసిన మెజారిటీ ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా జూన్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా ఆహా అధికారికంగా ప్రకటించింది.
Also Read