విశ్వక్ సేన్ కళ్యాణానికి ముహూర్తం కుదిరింది!
on Feb 2, 2022

'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్‌నుమాదాస్', 'హిట్' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అశోకవనంలో అర్జున కళ్యాణం'. టైటిల్ తోనే సినిమాపై ఆసక్తి కలిగేలా చేసిన మూవీ టీమ్ తాజాగా టీజర్ ని రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేసింది.
విశ్వక్ సేన్ హీరోగా విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'అశోకవనంలో అర్జున కళ్యాణం'. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్‌పై బి. బాపినీడు, సుధీర్ ఈదర నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ని తాజాగా విడుదల చేశారు. ఇందులో పెళ్లి వయస్సు దాటిపోయాక పెళ్లికి సిద్ధమైన యువకుడు అర్జున్ గా విశ్వక్ సేన్ కనిపిస్తున్నాడు. అసలే లేట్ వయసులో పెళ్లి, దానికి తోడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కావడంతో అర్జున్ కి ఎదురయ్యే పరిస్థితులను వినోదంగా చూపించారు. మొత్తానికి టీజర్ ఆద్యంతం వినోదంగా ఆకట్టుకునేలా సాగింది. టీజర్ ని బట్టి చూస్తే ఇదొక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని అర్థమవుతోంది.
టీజర్ చివర్లో ఈ సినిమా విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇచ్చింది మూవీ టీమ్. 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమా మార్చి 4 న థియేటర్స్ లో విడుదల కానుంది. మరి ఈ సినిమాతో విశ్వక్ సేన్ మరో హిట్ అందుకుంటాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



