'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ కష్టమేనా..?
on Apr 20, 2025
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. కళ్యాణ్ రామ్ తల్లి పాత్రలో విజయశాంతి నటించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ లో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 18న థియేటర్లలో అడుగుపెట్టింది. డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ, మంచి వసూళ్లనే రాబడుతోంది. అయితే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. (Arjun Son Of Vyjayanthi)
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5.15 కోట్ల గ్రాస్ రాబట్టింది. రెండో రోజు కూడా రూ.3.40 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. దీంతో రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.8.55 కోట్ల గ్రాస్ సాధించింది. మూడు రోజు ఆదివారం కావడంతో రూ.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. దీంతో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ లో రూ.12 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టనుంది.
అయితే 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ సుమారుగా రూ.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.35 కోట్ల గ్రాస్ దాకా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఫుల్ రన్ లో 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఆ టార్గెట్ ని రీచ్ అవుతుందో లేదో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
