బెడ్రూమ్ లో మందుకొట్టిన ఎన్టీఆర్ చెల్లెలు..!
on May 13, 2016

టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ చెల్లెలిగా చేసిన మధురిమ గుర్తుందా.. ఆ ఒక్కడు సినిమాతో టాలీవుడ్ లో ప్రస్థానం మొదలుపెట్టిన ఈ భామను తెలుగు సినిమాలు కనికరించలేదు. దాంతో చేసేది లేక చెల్లెలి క్యారెక్టర్ కూడా వేసేసింది. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ లో కనిపించలేదు. పద్ధతి గా ఉంటే ఎలాగూ పనికిరావట్లేదు కాబట్టి, అయిందేదో అయిందని హద్దులు దాటేయడమే బెటర్ అని ఫిక్సైందట.. అన్నట్టు ఈమె పేరు ఇప్పుడు మధురిమ కాదండోయ్. ఇంట్లో తనను పిలిచే ముద్దుపేరునే బాలీవుడ్ నేమ్ గా మార్చుకుని నైరా బెనర్జీ గా బాలీవుడ్ లో ట్రై చేస్తోంది. ఇప్పుడెవరైనా మధురిమ అని పిలిస్తే, మేడమ్ కు కోపం మామూలుగా రాదట.
సరే..అసలు విషయంలోకి వెళ్తే, నైరా గారు బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత వచ్చిన మొదటి అవకాశంగా, సన్నీలియోన్ సినిమా వన్ నైట్ స్టాండ్ లో ట్రై చేసింది. సినిమాలో సన్నీతో పాటే నైరా కు కూడా అంతే స్థాయి ఘాటు సన్నివేశాలున్నాయట. అయితే ఇప్పటి వరకూ అంత డెప్త్ ఉన్న సన్నివేశాల్లో నటించని ఈ భామకు ఇబ్బందిగా ఉండటంతో, మూవీ యూనిట్ సలహా మేరకు ఫుల్లుగా మందు కొట్టేసి సీన్ చేసిందట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికెళ్లే సమయంలో మ్మ కొడుతుందని భయం కూడా వేసిందట. ఇంతకూ ఈ పాప పేరు మార్చడం వెనుక కారణం తెలుసా..? మధురిమ అన్న పేరుతో మరో నటి కూడా ఉందట. ఈమెను ఇంటర్వ్యూ చేసి ఫోటోలు మాత్రం వేరే అమ్మాయివి వేశారట. అందుకే తనకంటూ ప్రత్యేకమైన పేరుండాలని నైరా బెనర్జీగా మారాను అంటోంది మధురిమ..సారీ సారీ..నైరా బెనర్జీ...!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



