Home

»

Latest News

రెహ‌మాన్ శిష్యుడికి మ‌హేశ్ ప్ర‌శంస‌.. రిప్లై ఇచ్చిన మ్యూజిక్ మేస్ట్రో!

Sep 27, 2021 10:54PM

 

పిల్లలు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే వారి తల్లిదండ్రులు పొందే ఆనందానికి వెల‌క‌ట్ట‌లేం. శిష్యులు తాము ఎంచుకున్న‌ రంగాలలో రాణిస్తే వారి గురువులు పొందే ఆనందం, గ‌ర్వం కూడా అలాంటివే. అందుకు ఉదాహరణ ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్. తాజాగా తన శిష్యుడు పవన్ కార‌ణంగా రెహమాన్ గర్వపడుతున్నారు. 

రెహమాన్ శిష్యుడు పవన్ సిహెచ్‌. సంగీత దర్శకత్వం వహించిన చిత్రం 'లవ్ స్టోరీ'. శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ట్ చేయ‌గా.. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన‌ ఈ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రం విడుదలకు ముందే 'లవ్ స్టోరీ'లోని పాటలన్నీ యూట్యూబ్‌లో దుమ్మురేపాయి. దీంతో ఈ చిత్ర విజయంలో పాటల సక్సెస్ కూడా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. 

ఈ నేపథ్యంలో ఈ చిత్ర విజయంపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సూప‌ర్‌స్టార్‌ మహేశ్ బాబుకు కూడా ప‌వ‌న్ మ్యూజిక్ తెగ న‌చ్చేసింది. "మీరు ప‌వ‌న్ గురించి మ‌రింత ఎక్కువ‌గా వింటారు. ఏం మ్యూజిక్‌.. జ‌స్ట్ సెన్సేష‌న‌ల్‌! అత‌ను ఎ.ఆర్‌. రెహ‌మాన్ శిష్యుడ‌ని విన్నాను. రెహ‌మాన్ సార్‌, అత‌న్ని చూసి మీరు గ‌ర్వించ‌వ‌చ్చు." అని ట్వీట్ చేశాడు. దానికి రెహ‌మాన్ స్పందించారు. మ‌హేశ్ ట్వీట్‌ను రిట్వీట్ చేసి, ‘అవును మహేశ్.. పవన్ సూపర్ టాలెంటెడ్ అండ్ హంబుల్. మేమందరం అతనిని చూసి గర్వపడుతున్నాం’ అంటూ రాసుకొచ్చారు.    

ప్ర‌స్తుతం 'ల‌వ్ స్టోరి' ఇటు తెలుగు రాష్ట్రాల‌లోనే కాకుండా, ఓవ‌ర్సీస్‌లోనూ మంచి క‌లెక్ష‌న్ల‌ను సాధిస్తూ, బ్లాక్‌బ‌స్ట‌ర్ దిశ‌గా దూసుకుపోతోంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ మూవీని ఆద‌రిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com