పిల్లల్ని కనాలని ఉంది!
on Feb 5, 2018
‘నాకు పిల్లల్ని కనాలని ఉంది. ‘అమ్మా..’ అని పిలిపించుకోవాలనుంది. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. అయితే... భగవంతుడు ఎప్పుడు.. ఎలా నా కొరిక తీరుస్తాడో చూడాలి‘ అని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది అనుష్క.
‘భాగమతి’ ప్రెస్ మీట్ లో పెళ్లి గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబిచ్చింది జేజమ్మ. ’ఇప్పటికే ఇంట్లో పెళ్లి పోరు ఎక్కువైంది. అమ్మా, నాన్న పెళ్లి చేసుకోమని తొందరపెడుతున్నారు. నాక్కూడా పెళ్లాడాలనే ఉంది. అయితే... ఎవర్నిపడితే వాళ్లను చేసుకోలేను కదా. మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడాలి. అతని కోసమే చూస్తున్నా. త్వరలోనే మీ అందరికీ శుభవార్త చెబుతా‘ అని చెప్పుకొచ్చింది అనుష్క.
చాలాకాలం తర్వాత ‘భాగమతి’ రూపంలో తనకు సోలో హిట్ దొరికిందని. ఈ సినిమా యాభై కోట్ల క్లబ్ లో చేరడం ఆనందంగా ఉందని.. సంతోషం వెలిబుచ్చింది అనుష్క. అదన్నమాట విషయం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
