ఆవిడగారి క్రేజ్ అలా ఉంది మరి!
on Aug 18, 2017

నిజంగా అనుష్క అదృష్టవంతురాలు. హీరోయిన్లకు అరుదుగా వచ్చే అవకాశాలన్నీ ఒక్క అనుష్కనే వరించడం అదృష్టం కాక మరేంటి? ఏ ముహూర్తాన ‘అరుంధతి’ చేసిందో కానీ... ఇక అక్కడ్నుంచీ అద్భుతమైన పాత్రలన్నీ అనుష్క చెంతకే చేరుతున్నాయ్. ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’లో దేవసేన.. ఇప్పుడు ‘బాగమతి’. చరిత్రలో నిలిచిన హృద్యమైన ప్రేమకథ బాగమతి . ఆ కథకు తెరరూపం ఇవ్వలానే ఆలోచన రావడమే ఓ సాహసం.. ఈ విషయంలో యూవీ క్రియేషన్ వారిని అభినందించాల్సిందే.
‘పిల్ల జమీందర్’ఫేం అశోక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ జరుగుతున్నాయ్. డిసెంబర్ లో చిత్రాన్ని విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఎక్కువ సమయం తీసుకుంటున్నామని దర్శకుడు చెబుతున్నారు. ఆగస్ట్ 15న విడుదల చేయాలనుకున్న ఈ చిత్రం ఉన్నట్లుండి ఆలస్యం అవ్వడానికి కారణం అదే.
విజువల్ ఎఫెక్ట్ష్ లేకుండా ఈ చిత్రాన్ని చూసిన ఓ బాలీవుడ్ పంపిణీదారుడు... హిందీ వెర్షన్ ని 12.5 కోట్లకు కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే... 40 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అయిపోయిందట. ‘బాగమతి’క్రేజ్ అలా ఉంది మరి. ఇందులో ప్రతి నాయకునిగా ఆది పినిశెట్టి నటిస్తున్న విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



