అనుష్కకు ఫ్లాట్ అయిపోయిన దర్శకుడు..!
on Jun 9, 2016

పైకొచ్చేవాళ్లకు ఉండే మొదటి లక్షణం హార్డ్ వర్క్. అలా వృత్తి కోసం నిబద్ధతతో కష్టపడే వాళ్లు అందర్నీ ఆకర్షిస్తుంటారు. ఈ కేటగిరీలోకే వస్తుంది అనుష్క శర్మ. సుల్తాన్ సినిమాలోని తన పాత్రకోసం కఠినమైన రెజ్లింగ్ శిక్షణ తీసుకోవడమే కాక, హర్యానా భాషకు సంబంధించిన యాసను నేర్చుకుని ఏ మాత్రం తొట్రుపాటు లేకుండా సినిమా అంతా అద్భుతమైన నటనను కనబరిచింది. ఆమెను పట్టుదలను చూసి పడిపోయానంటున్నాడు సుల్తాన్ దర్శకుడు అలీ అబ్బాస్. సినిమాలో ఆమె పెర్ఫామెన్స్ కు, సినిమా బయట ఆమె చేసిన హార్డ్ వర్క్ కు వందకు వంద మార్కులు వేయాలి అంటే ఆమెను ఆకాశానికెత్తేస్తున్నాడు.
సుల్తాన్ లో నటించడం కోసం అనుష్క ముగ్గురు ట్రైనర్లను నియమించుకుందట. రెజ్లింగ్ నేర్చుకోవడానికి ఒకరు, పవర్ పెరగడానికి కండరాలు పెంచుకోవడానికి ఒకరు, ఒత్తిడి నుంచి రిలీఫ్ కోసం ఒక ఫిజియోథెరపిస్ట్..ఇలా ముగ్గుర్ని పెట్టుకుని తన సాధన సాగించింది. ఆమెకు నేను ఆరు వారాల టైం మాత్రమే ఇచ్చాను. ఇంత తక్కువ టైంలో ఏం చేయగలదు అని అనుమాన పడేవాడినని, అయితే తన డౌట్స్ అన్నింటినీ ఆమె పటాపంచలు చేసేసిందంటున్నాడు అబ్బాస్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



