'ఆదిపురుష్'లో అనుష్క? చాన్సే లేదు!
on Sep 15, 2020
కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ బ్యూటీ అనుష్కాశర్మ ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని భర్త విరాట్ కోహ్లీతో కలిసి తీయించుకున్న పిక్చర్తో షేర్ చేసి, అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఓవైపు ఆమె తొలిసారి తల్లి కాబోతున్నందుకు ఫ్యాన్స్ ఎగ్జయిట్ అవుతుండగా, మరోవైపు ఆమె నెక్ట్స్ ఫిల్మ్ గురించి బజ్ మొదలైంది. ఆమె తన తదుపరి సినిమాని ఇంతదాకా అఫిషియల్‌గా అనౌన్స్ చేయకపోయినా, శ్రీరామునిగా ప్రభాస్ నటించనున్న 'ఆదిపురుష్' మూవీలో సీతగా అనుష్క నటించనున్నదంటూ ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆమె 'ఆదిపురుష్' సినిమాని చేయడం లేదని వెల్లడైంది. 2021 ఏప్రిల్ తర్వాత ఆమె తన తదుపరి సినిమాని ప్రకటించే అవకాశం ఉంది.
మళ్లీ సినిమా సెట్స్ మీదకు రావాలని అనుష్క ఆసక్తిగా ఎదురుచూస్తోందనీ, అయితే కాన్పు అయ్యాక మూడు నాలుగు నెలల తర్వాతే ఆమె నటించడం మొదలు పెడుతుందని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. అప్పుడు బిగ్ అనౌన్స్మెంట్స్ ఉంటాయనీ, అయితే కచ్చితంగా వాటిలో 'ఆదిపురుష్' ఉండే అవకాశం లేదని అవి చెప్పాయి. ఇప్పటి వరకూ ఆ సినిమా గురించి ఆమెతో ఎవరూ సంప్రదించలేదనీ, అందువల్ల ఆ సినిమాకు ఆమె డేట్స్ ఇచ్చిందంటూ వస్తున్న ప్రచారం అబద్ధమనీ ఆ వర్గాలు స్పష్టం చేశాయి.
ఓం రౌత్ డైరెక్షన్లో భూషణ్ కుమార్ నిర్మించే 'ఆదిపురుష్'లో రావణాసురునిగా సైఫ్ అలీఖాన్ ఎంపికైనట్లు అధికారికంగా ప్రకటించారు. సీత పాత్రకు పరిశీలనలో ఉన్నారంటూ మొదట కీర్తి సురేశ్ పేరు, తర్వాత అనుష్కా శర్మ పేరు ప్రచారంలోకి వచ్చాయి కానీ ఇంతవరకూ ఎవరినీ ఫైనలైజ్ చేయలేదు.
Also Read