'కార్తికేయ 2' కథానాయిక కాంట్రవర్సీలో క్లారిటీ
on Jun 6, 2020
.jpg)
'కార్తికేయ 2'లో కొత్త కథానాయిక ఎవరు? కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ సినిమా నుండి తప్పుకుందా? ఆమెను సినిమా యూనిట్ తప్పించిందా? ఏదో కాంట్రవర్సీ అయిందంటగా?.. ఇలా గత కొన్ని రోజులుగా ఏవేవో వినబడుతున్నాయి. దర్శకుడు చందు మొండేటి ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. "మా సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. తప్పకుండా ఆమె సినిమా చేస్తుంది" అని దర్శకుడు పేర్కొన్నారు. ఒక్క మాటతో పుకార్లకు చెక్ పెట్టారు.
నిఖిల్ కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'కార్తికేయ' నిర్మాతకు లాభాలు తెచ్చింది. భారీ వసూళ్లు సాధించడమే కాదు, ప్రేక్షకులతో పాటు విమర్శకులను మెప్పించింది. ఆ సినిమాకు సీక్వెల్ గా 'కార్తికేయ 2' ప్లాన్ చేశారు. 'కార్తికేయ'లో వైద్య విద్యార్థిగా కనిపించిన నిఖిల్, సీక్వెల్‌లో వైద్యుడిగా కనిపించనున్నారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తిరగడం మొదలుపెట్టిన తర్వాత కంబోడియాకి వెళ్లి కొన్ని లొకేషన్స్ ఫైనలైజ్ చేయాలని అనుకుంటున్నారు. కంబోడియా, గుజరాత్ రాష్ట్రంలో కొన్ని లొకేషన్స్, విశాఖలో సినిమా షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



