హీరోయిన్స్ ని మాత్రమే అడుగుతారు.. వాళ్ళకి అది కావాలిగా
on Aug 20, 2025

మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన' అనుపమ పరమేశ్వరన్'(Anupama Parameswaran)2016లో 'నాగచైతన్య'(Naga Chaitanya)హిట్ మూవీ 'ప్రేమమ్' ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమాన నటిగా మారింది. ఎలాంటి సబ్జెట్ లో చేసినా, తన క్యారక్టర్ పరిధి మేరకు అద్భుతంగా నటించగలదు. ప్రేక్షకుల్లో మన పక్కింటి అమ్మాయి, సదరు క్యారక్టర్ లో చేస్తుందా అని అనిపించడం అనుపమ నటన స్పెషాలిటీ. ఎక్కువగా క్లీన్ ఎంటర్ టైనర్ చిత్రాల్లో నటించే అనుపమ గత ఏడాది రొమాంటిక్, క్రైమ్ కామెడీ 'టిల్లుస్క్వేర్' చేయడం పెద్ద సంచలనం సృష్టించింది. ఈ నెల 22 న తన కొత్త మూవీ 'పరదా'(Paradha)తో ప్రేక్షకుల ముందుకు రానుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కగా, అనుపమ లుక్ తో పాటు ప్రచార చిత్రాలు బాగుండటంతో పరదా పై మంచి అంచనాలు ఉన్నాయి.
రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి జరిగిన ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతు పరదా కి సంబందించిన పోస్టర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది అట్టర్ ప్లాప్ అవుతుందని కామెంట్స్ చేసారు. ఒక వేళ సినిమా ప్లాప్ అయినా మంచి సినిమా చేశాననే సంతృప్తి నా జీవితం మొత్తం ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో అలాంటి కామెంట్స్ కి బాధపడేదాన్ని.అనుభవం వచ్చే కొద్దీ అవి చాలా చిన్న విషయాలుగా తీసుకుంటున్నాను. టిల్లుస్క్వేర్ రిలీజ్ కి ముందు నా పై చాలా నెగిటివ్ వచ్చింది. కానీ రిలీజ్ తర్వాత మంచి ప్రశంసలు దక్కాయి.
అలాంటి రోల్స్ ని అంగీకరించడమే సవాలు. ప్రమోషన్స్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో చాలా ఇబ్బంది కరమైన ప్రశ్నలు వేశారు. వాటికి సమాధానం చెప్పలేకపోయాను. అలాంటి ప్రశ్నలని హీరోలని అడగరు. కేవలం హీరోయిన్స్ ని మాత్రమే అడుగుతారు. వాళ్ళకీ కావాల్సింది వ్యూస్ అని అనుపమ చెప్పుకొచ్చింది. ఇక పరదా కి సినిమాబండి, శుభం చిత్రాల ఫేమ్ 'ప్రవీణ్ కాండ్రేగుల'(Praveen Kandregula)దర్శకత్వం వహించగా ఆనంద మీడియా(Ananda Media)నిర్మించింది. గోపి సుందర్(Gopi Sundar)మ్యూజిక్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



