
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందిన 'ది ప్యారడైజ్' మూవీ సెప్టెంబర్ 24న విడుదలైంది. టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇదిలా ఉంటే, విడుదలకు ముందు 'ప్యారడైజ్' గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి.
నాని, శ్రీకాంత్ ఓదెల మధ్య విభేదాలు వచ్చాయని.. నాని తిడితే శ్రీకాంత్ అలిగాడని.. ఇలా గాసిప్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో ఈ గాసిప్స్ పై శ్రీకాంత్ స్పందించారు.
"ఈ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ లో నేను కొన్ని చదివాను. నాని అన్నకి కోపం వచ్చింది, నాని అన్న తిట్టాడు, నాని అన్న కొట్టాడు, శ్రీకాంత్ అలిగాడు అని. నాని అన్నకి, నాకు గొడవలు అయ్యాయని కొన్ని చదివాను. అదంతా నిజమే అయ్యుండొచ్చు. కానీ, నాని అన్నతో నా బాండింగ్ దసరాకో, ప్యారడైజ్ కో పరిమితమైంది కాదు. మాది సినిమాని దాటిన ఎమోషన్. ఆయన నన్ను భరించాలి, నన్ను మోయాలి.. వేరే ఆప్షన్ లేదు. మేము తన్నుకుంటాం, తిట్టుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం. కొన్ని ఎమోషన్స్ బతుకు దగ్గర ఆగొద్దు, చావుని దాటి చూడాలి. నాని అన్నతో నాది అలాంటి ఎమోషన్." అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
శ్రీకాంత్ ఓదెల మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీకాంత్ స్టేజ్ మీద మాట్లాడుతున్న సమయంలో.. ఎదురుగా ఉన్న నాని సైతం ఆ మాటలను నవ్వుతూ ఎంజాయ్ చేయడం విశేషం.
ఇది కూడా చదవండి: అంతకుమించి.. ‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.!
[Srikanth Odela About Clashes With Nani, Srikanth Odela Speech, The Paradise Movie, Nani Paradise, Natural Star Nani, Srikanth Odela, Mohan Babu, Kayadu Lohar, Telugu Film News, Telugu News]






