నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 1 ఫిల్మ్.. 'అంటే సుందరానికీ!'
on Jul 13, 2022

నాని, నజ్రియా నజీమ్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ 'అంటే సుందరానికీ!' జూన్ 10న విడుదలై, బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అనిపించుకుంది. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ మూవీని విమర్శకులు సైతం మెచ్చలేదు. ఇందులో నదియా, నరేశ్, హర్షవర్ధన్, రోహిణి, రాహుల్ రామకృష్ణ, నిక్కీ తంబోలి, పృథ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యర్ ఇతర కీలక పాత్రలు చేశారు. ఈ మూవీ బిగ్ స్క్రీన్‌పై ఆడకపోయినా, లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం నెట్‌ఫ్లిక్స్‌లో దేశంలోని టాప్ 10 మూవీస్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది.
థియేటర్లలో విడుదలైన సరిగ్గా నెలకు జూలై 10న 'అంటే సుందరానికీ!' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తెలుగు వెర్షన్ టాప్ 1 ప్లేస్‌లో ఉండగా, తమిళ వెర్షన్ 'అడాడే సుందర' టాప్ 6 ప్లేస్‌లో నిలవడం గమనార్హం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ సమకూర్చాడు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్‌గా, రవితేజ గిరజాల ఎడిటర్‌గా వర్క్ చేశారు.
పలువురు సెలబ్రిటీలు ఈ సినిమాని డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. లేటెస్ట్‌గా హీరోయిన్ రాశీ ఖన్నా, "A true treasure is Ante Sundaraniki. The entire cast, including nani and Nazriya Fahadh, is heartfelt. I appreciate you penning and completing such stories, vivek Athreya అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.
'అంటే సుందరానికీ'లో బ్రాహ్మణ యువకుడు సుందర్‌గా నాని, క్రిస్టియన్ యువతి లీలగా నజ్రియా నటించారు. సుందర్ కొలీగ్‌గా అనుపమా పరమేశ్వరన్ ఓ స్పెషల్ రోల్ చేసింది. నజ్రియాకు ఇదే తొలి తెలుగు చిత్రం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



