Home

»

Latest News

శ్రీలీల షాకింగ్ వీడియో: రెడ్ డ్రెస్‌లో మరీ దారుణంగా.!

Nov 10, 2026 3:56PM

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే కొందరు మాత్రం ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ సెలబ్రిటీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా హీరోయిన్ల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 

ఇప్పటికే పలువురు నటీమణులు ఇలాంటి డీప్‌ఫేక్ బారిన పడగా.. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీలకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శ్రీలీల మొదటి నుంచి స్కిన్ షోకి దూరంగానే ఉంటున్నారు. అలాంటిది రెడ్ డ్రెస్‌లో ఆమె దారుణంగా స్కిన్ షో చేస్తున్నట్లు ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది నిజమైన వీడియో కాదు. డీప్‌ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన ఫేక్ కంటెంట్. 

కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ లో బర్త్ డే పార్టీలోని ఒక క్లిప్ కి.. శ్రీలీల ఫేస్ ని, అవుట్ ఫిట్ ని జోడించి ఈ ఫేక్ వీడియో చేశారు. ఈ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కొందరు నిజమని నమ్మి, శ్రీలీల ఏంటి ఒక్కసారిగా ఇలా మారిపోయిందని షాక్ అయ్యారు.

ఇది కూడా చదవండి: శ్రీలీలను టాలీవుడ్‌ పక్కన పెట్టింది.. కోలీవుడ్‌ నెత్తిన పెట్టుకుంటోంది.!

ఇక శ్రీలీలకు గతంలోనూ ఇలాంటి అనుభవం ఎదురైంది. 2025 డిసెంబర్‌లో తనకు సంబంధించిన ఏఐతో రూపొందించిన అభ్యంతరకర చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించడానికి, దుర్వినియోగం చేయడానికి చాలా తేడా ఉందని శ్రీలీల పేర్కొన్నారు. ఇలాంటి కంటెంట్‌ను ఎవరూ ప్రోత్సహించవద్దని అభిమానులను కోరారు. 

నిజానికి సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను ఉపయోగించి ఇలాంటి ఫేక్ కంటెంట్ సృష్టించడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా హీరోయిన్లను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన వీడియోలు తయారు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి కంటెంట్‌ను చూసి నిజమని నమ్మి షేర్ చేయడం కూడా బాధితులకు మరింత నష్టం కలిగిస్తుంది.

మీకు నచ్చవచ్చు:
రేణూ దేశాయ్ ఫస్ట్ రియాక్షన్.. పవన్ కళ్యాణ్ విడాకులపై మాజీ భార్య షాకింగ్ కామెంట్స్.!
బిగ్ ట్విస్ట్.. విడాకుల తర్వాత మళ్ళీ కలిసిపోయిన స్టార్ కపుల్.?

 

 

 

[Sreeleela Deepfake Video, Sreeleela Viral Video, Sreeleela Red Dress, Sreeleela Fake Video, Sreeleela AI Video, Sreeleela AI Deepfake, Sreeleela Latest, Sreeleela, Celebrity Deepfake]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com