Home

»

Latest News

Anirudh ravichander: అనిరుద్ రెమ్యునరేషన్ ఇంతే!.. మరి క్యూ కడుతున్నారుగా

Jul 1, 2026 12:51PM

 

ఇప్పుడు 'అ' అంటే అనిరుద్ అనే పరిస్థితి. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో  అనిరుధ్ అంటే ఒక  బ్రాండ్‌గా మారిపోయిందని కూడా చెప్పవచ్చు. తనదైన స్టైల్ చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో పాటు, థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) అందించడంలో  సిద్ధహస్తుడు. అందుకే ఇప్పుడు టాలీవుడ్‌కి  చెందిన టాప్ ప్రొడ్యూసర్లు, స్టార్ హీరోలు, దర్శకులు తమ సినిమాలకి  అనిరుధ్ మ్యూజిక్ మాత్రమే కావాలని పట్టుబడుతున్నారు.

దీంతో ఇండస్ట్రీలో అనిరుధ్  జపం గట్టిగా వినిపిస్తోంది. దీంతో ఒకప్పుడు  15 కోట్ల రూపాయలుగా ఉన్న అనిరుధ్ రెమ్యునరేషన్, ఇప్పుడు ఏకంగా 25 కోట్ల రూపాయల భారీ మార్కుకి చేరుకుంది. ఇదంతా మన తెలుగు నిర్మాతల చలవే. ఈ స్థాయిలో పారితోషికం అందుకోవడం ద్వారా దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రికార్డు సృష్టించారు. సాధారణంగా ఈ స్థాయి రెమ్యూనరేషన్ చాలా మంది హీరోల పారితోషికంతో సమానమని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. అయినప్పటికీ, అనిరుధ్ పేరుతో వచ్చే క్రేజ్, సోషల్ మీడియాలో వచ్చే హైప్, సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్‌పై పడే సానుకూల ప్రభావం దృష్ట్యా నిర్మాతలు ఆయన అడిగినంత ఇచ్చేందుకు వెనకాడటం లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'AA23' సినిమా కోసం అనిరుధ్‌ కి  25 కోట్ల భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో రజనీకాంత్ 'కూలీ' సినిమాకు ఆయన తీసుకున్న  10 కోట్ల నుండి 12 కోట్ల పారితోషికంతో పోలిస్తే ఇది రెండింతలు ఎక్కువ కావడం విశేషం.


also read: Peddi: పెద్ది ఓటిటి డేట్ పై షాకింగ్ అప్ డేట్.. ముమ్మాటికీ ఇది వీళ్ళ పనే!

టాలీవుడ్‌లో అనిరుధ్ క్రేజ్ ఇక్కడితో ఆగడం లేదు. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' కోసం అనిరుధ్ సుమారు రూ. 15 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన 'ఆయా షేర్' సాంగ్ సోషల్ మీడియాలో చార్ట్‌బస్టర్‌గా నిలిచి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2' కోసం రూ. 18 కోట్లు, దళపతి విజయ్ 'జన నాయగన్' కోసం రూ. 15 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఇండస్ట్రీలో ఒక చిన్న టాక్ ఉంది.. అనిరుధ్ ట్యూన్స్ ఇవ్వడంలో కొంచెం లేట్ చేస్తాడని, రీ-రికార్డింగ్ సమయంలోనూ సమయానికి అవుట్‌పుట్ ఇవ్వడని అంటుంటారు. ఐనప్పటికీ, ఆయన ఇచ్చే అవుట్‌పుట్ థియేటర్లలో ప్రేక్షకులకు ఇచ్చే కిక్ వేరే లెవెల్‌లో ఉండటంతో దర్శకనిర్మాతలు అనిరుధ్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. రీసెంట్ గా అధికారకంగా స్టార్ట్ అయిన ఎన్టీఆర్, త్రివిక్రమ్  గాడ్ ఆఫ్ వార్ కి కూడా అనిరుద్ నే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com