Home

»

Latest News

హ్యాంగ్‌మ్యాన్ ట్రైలర్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అత్యాచారం.. ఉరిశిక్షల వెనుక డార్క్ రియాలిటీ!

Jul 1, 2026 12:58PM

సీనియర్ నటుడు బ్రహ్మాజీ (Brahmaji) ప్రధాన పాత్రలో సరికొత్త థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న చిత్రం 'హ్యాంగ్‌మ్యాన్' (Hangman). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సన్ నెక్స్ట్' (Sun NXT) విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే సమాజంలోని ఒక అత్యంత సున్నితమైన, వివాదాస్పదమైన మరియు బాధ్యతాయుతమైన వృత్తి నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని స్పష్టమవుతోంది. ఉరిశిక్షలు అమలు చేసే జైలు సిబ్బంది (హ్యాంగ్‌మ్యాన్) జీవితం, వారి మానసిక సంఘర్షణ, వారి కుటుంబాలు ఎదుర్కొనే సామాజిక ఇబ్బందులను ఈ చిత్రంలో చాలా సహజంగా, కాస్త రా అండ్ రస్టిక్ పంథాలో చూపించబోతున్నారు.

ట్రైలర్ ప్రారంభంలోనే "మన పని మనిషిని బాధపెట్టడం కాదు.. చంపడం మాత్రమే" అంటూ సాగే డైలాగ్స్ ఈ సినిమా కథ ఎంత ఇంటెన్సివ్‌గా ఉండబోతుందో హింట్ ఇస్తాయి. తరతరాలుగా వస్తున్న ఈ కులవృత్తిని చేస్తూ, సమాజంలో కేవలం ఒక మురికి పని చేసే చేతులుగా సమాజం చూసే ఓ వ్యక్తి ఆవేదనను బ్రహ్మాజీ తన నటనతో అద్భుతంగా పండించారు. ఉరి తీసే ప్రక్రియలో భాగంగా కొలతలు తీసుకోవడం, ఒక్కో ఉరికి 25 వేల చొప్పున భారీ మొత్తంలో రూపాయలు ఇవ్వడం లాంటి సీన్లు ఇండస్ట్రీలో ఇప్పటివరకు రాని ఒక రా జైలు డ్రామాను కళ్ళకు కడుతున్నాయి. నీ సంవత్సరం జీతం కంటే ఎక్కువ డబ్బులు ఇస్తాం సంతకం చెయ్ అంటూ వచ్చే సన్నివేశాలు ఈ వృత్తి వెనుక ఉండే ఆర్థిక ఇబ్బందులను కూడా ఎత్తిచూపుతున్నాయి.

మరోవైపు, రాజధానిలో 24 ఏళ్ల ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై మానవ మృగాలు అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారనే న్యూస్ బులిటెన్ సీన్ ఈ కథను ఒక కీలకమైన సామాజిక సమస్యతో ముడిపెడుతుంది. తప్పు చేస్తే ఉరి శిక్ష పడుతుంది అంటే ఒక్కొక్కడికి భయం పుట్టాలి, అప్పుడే సమాజంలో ఇలాంటి దారుణాలు ఆగుతాయి అనే బలమైన సందేశాన్ని ఈ చిత్రం ద్వారా ఇవ్వబోతున్నారు. సమాజంలో పెద్ద తప్పులు చేసే క్రిమినల్స్, వారు ఎంపీ కొడుకైనా, సీఎం కొడుకైనా సరే చట్టం ముందు సమానమేనని, అలాంటి వాళ్లను జైలు గదిలో ఉరి తీసే సీన్లు ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. జైలు నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ డ్రామా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకోనుంది.

ఈ వైవిధ్యభరితమైన క్రైమ్ థ్రిల్లర్ మూవీ జూలై 3న నేరుగా 'సన్ నెక్స్ట్' ఓటీటీ వేదికగా డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ నటన, ఆయన లుక్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచిపోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సమాజంలో నేరస్థులకు పడే శిక్షలు, చట్టం యొక్క పవర్, హ్యాంగ్‌మ్యాన్ ఎదుర్కొనే నిద్రలేని రాత్రుల చుట్టూ తిరిగే ఈ భావోద్వేగభరిత కథాంశం ఓటీటీ ఆడియన్స్‌కు ఒక సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com