విజయ్, అనిరుధ్.. హ్యాట్రిక్ ఎటెంప్ట్
on Feb 25, 2021
కోలీవుడ్ స్టార్ విజయ్ కి అచ్చొచ్చిన స్వరకర్తల్లో అనిరుధ్ ఒకరు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండు కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఆ చిత్రాలే.. `కత్తి`. `మాస్టర్`.
`కత్తి` 2014లో విడుదల కాగా.. `మాస్టర్` 2021 ఆరంభంలో వచ్చింది. అంటే.. దాదాపు ఏడేళ్ళ గ్యాప్ ఉందన్నమాట. అయితే, వీరి కాంబోలో రానున్న మూడో సినిమా మాత్రం అతి తక్కువ గ్యాప్ లోనే రాబోతోందని కోలీవుడ్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. `కొలమావు కోకిల` ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుధ్ బాణీలు అందించబోతున్నారని టాక్. అంతేకాదు.. పాన్ ఇండియా మూవీగా విజయ్ నెక్స్ట్ వెంచర్ ఉంటుందని కోలీవుడ్ సమాచారం.
మరి.. విజయ్, అనిరుధ్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమా `కత్తి`, `మాస్టర్` తరహాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
Also Read