ENGLISH | TELUGU  

'యాంగర్ టేల్స్' వెబ్ సిరీస్ రివ్యూ

on Mar 11, 2023

 

వెబ్ సిరీస్ పేరు: యాంగర్ టేల్స్
తారాగణం: వెంకటేశ్ మహా, సుహాస్, బిందు మాధవి, తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్, ఫణి ఆచార్య, సుధ తదితరులు
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
సంగీతం: స్మరణ్ సాయి
సినిమాటోగ్రఫీ: ఏజే ఆరోన్, అమర్‌దీప్, వినోద్ బంగారి, వెంకట్ ఆర్. శాకమూరి
నిర్మాతలు: సుహాస్, శ్రీధర్ రెడ్డి
దర్శకుడు: ప్రభల తిలక్
ఓటిటి వేదిక: డిస్నీ + హాట్ స్టార్

ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో కోపం వస్తుంది. కొన్నిసార్లు మనసులోనే అణుచుకుంటాం, కొన్నిసార్లు బయటకు ప్రదర్శిస్తాం. విభిన్న మనుషులు, వారి కోపాల సమాహారంగా నాలుగు కథలతో రూపొందిన ఆంథాలజీ యాంగర్ టేల్స్. ఈ సీరీస్ ఎలా ఉంది? నాలుగు కథలు ఆకట్టుకున్నాయా?  

కథ 
బెనిఫిట్ షో కోసం ఒక థియేటర్ దగ్గర ఏర్పాట్లు జరుగుతుంటాయి. అప్పడే ఆ థియేటర్ యజమాని వచ్చి ఇవన్నీ ఆపేయండని, బెనిఫిట్ షో లేదని చెప్తాడు. ఇక వాళ్ళు ఈ విషయాన్ని ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రంగ(వెంకటేశ్ మహా)కి కాల్ చేసి చేప్తారు. ఆ తర్వాత కాసేపటికి రంగ వచ్చి చెప్పినా ఆ థియేటర్ యజమాని అంగీకరించకపోవడంతో.. తనకు తెలిసిన ఒక‌ డిస్టిబ్యూటర్ స్వామితో రంగ మాట్లాడిస్తాడు. దాంతో ఆ థియేటర్ యజమాని బెనిఫిట్ షోకి అనుమతిస్తాడు. అయితే అప్పుడే కథలోకి పచ్చబొట్టు శీను(సుహాస్) వస్తాడు. పచ్చబొట్టు శీను బెనిఫిట్ షో కోసం ఒక రెండొందల మందికి టికెట్లు బుక్ చేసి తీసుకొస్తాడు. అయితే అదే టైం లో అన్ని థియేటర్లలో బెనిఫిట్ షో లు నిలిపివేస్తున్నట్లు రంగతో పాటు పచ్చబొట్టు శీనుకి తెలుస్తుంది. అలా తెలిసాక వాళ్ళేం చేసారనేది ఫస్ట్ ఎపిసోడ్ కథ. రెండవ ఎపిసోడ్‌లో రాజీవ్(తరుణ్ భాస్కర్) - పూజా రెడ్డి(మడోన్నా సెబాస్టియన్)కి వివాహం జరుగుతుంది. పూజారెడ్డి పెళ్ళికి ముందు నాన్ వెజ్ తింటుండేది. పెళ్ళి తర్వాత వెజిటేరియన్ గా మారాల్సి వస్తుంది. తన భర్త కోసం, అత్త కోసం తనకిష్టమైన ఫుడ్ ని వదులుకోవాల్సి వస్తుంది. అయితే తనకొచ్చిన ఈ యాంగర్ ని ఎలా ఎదుర్కొందనేది మిగతా కథ. 

మూడవ ఎపిసోడ్ లో రాధ(బిందు మాధవి) ఒక హౌస్ వైఫ్ గా పాత ఇంట్లో ఉంటుంది. అయితే తనకి క్షణం తీరిక లేకుండా ఉండటంతో కాసేపు పడుకుందామనేసరికి అక్కడ చుట్టుప్రక్కల వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటారు. ఆ టార్చర్ ఎలా ఎదుర్కొంది అనేది మిగతా కథ. నాల్గవ ఎపిసోడ్‌లో గిరి పాత్ర చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. గిరి(ఫణి ఆచార్య) ముప్పై సంవత్సరాల పైబడినా‌‌ కూడా వివాహం జరగకపోవడం, ఉన్న జాబ్ లో గ్రోత్ లేకపోవడం.. దీంతో అతడు తన యాంగర్ ని ఎలా కంట్రోల్ చేసుకున్నాడనేది మిగతా కథ.

విశ్లేషణ
యాంగర్ టేల్స్ సిరిస్ పేరుకి తగ్గట్టుగా మొదటి ఎపిసోడ్ ఉంది. హీరో ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా రంగ క్యారెక్టర్ లో వెంకటేశ్ మహా ఒదిగిపోయాడు. పచ్చబొట్టు శీను పాత్రలో సుహాస్ ఆకట్టుకున్నాడు. ఒక హీరోకి ఉండే ఫ్యాన్.. అతడు ఎంతగానో అభిమానించే హీరో మూవీ రిలీజ్ అయ్యే ముందుగా వేసే బెనిఫిట్ షో చుట్టూ సాగే కథ. ఈ కథలో మనం రంగ క్యారెక్టర్ యొక్క యాంగర్ ని ఇంకా ఫ్రస్టేషన్ ని చూడొచ్చు. బోల్డ్ లాగ్వేంజ్ తీసేస్తే ఈ ఎపిసోడ్ లో యాంగర్ తో పాటు అన్ని ఎమోషన్స్ ని బాగా తీర్చిదిద్దారు మేకర్స్. పచ్చ బొట్టు శీను రావడంతోనే ఒక హైప్ క్రియేట్ అవుతుంది. రెండొందల మంది ఫ్యాన్స్ తో థియేటర్ ముందు ఫ్యాన్ షో కోసం ఎదురుచూసే సీన్లు, చెప్పిన టైం కి షో పడకపోతే వచ్చే యాంగర్ ని చూపించడంలో సుహాస్ ఒదిగిపోయాడు.

రెండవ ఎపిసోడ్ 'ఫుడ్ ఫెస్టివల్' అనే టైటిల్ తో ఉంది. పెళ్ళికి ముందు నాన్ వెజిటేరియన్ అయిన అమ్మాయి పెళ్ళి అయ్యాక వెజిటేరియన్ గా మారాల్సి వస్తుంది. సరైన పౌష్టికాహారం అందకపోవడంతో వీక్ అవుతుంది. దీంతో తన యాంగర్ ని కంట్రోల్ చేసుకోలేక తను ఏం చేసిందనేది మిగతా కథ. ఈ ఎపిసోడ్ మొత్తం స్లోగా సాగుతుంది. స్లో సీన్స్ అన్నీ తీసేస్తే కనీసం అయిదు నిమిషాల కథ కూడా ఉండదు. ఈ ఎపిసోడ్ చూస్తునంతసేపు ఇంకెప్పుడు అవుతుందా అనిపిస్తుంది. మూడవ ఎపిసోడ్ 'ఆఫ్టర్ నూన్ నాప్' .. రాధ (బిందు మాధవి) తనకి రెగ్యులర్ గా ఉండే పని ఒత్తిడిలో కాస్త కూడా రెస్ట్ ఉండదు. మధ్యాహ్నం దొరికే కాస్తంత టైంలో పడుకుందామనేసరికి ఇంటిపక్కనే ఉండేవాళ్ళ టార్చర్ ఎక్కువైపోతుంటుంది. దీంతో తన ఫ్రస్ట్రెషన్ పెరుగుతుంది. తర్వాత తను ఏం చేసిందనేదే మిగతా కథ. కానీ ఈ ఒక్క ఎమోషన్ తప్ప మిగతాదంతా స్లోగా సాగుతుంది. 

నాల్గవ ఎపిసోడ్ హెడ్ హెల్మెట్.. గిరి(ఫణి ఆచార్య) పాత్ర చుట్టూ తిరిగే ఈ కథని ఎందుకు తీసాడో? అసలు ఏం ఉందో? అర్థం కాదు. చూస్తున్నంతసేపు బోర్ కొట్టించేస్తుంది. స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేకపోయింది. కథని అయిదారు నిమిషాలు రాసుకొని మిగతాదంతా సాగదీద్దాం అని ఫిక్స్ అయినట్టుగా ఉంది. ఇది చూసే మనకే యాంగర్ వస్తుంది. బోల్డ్ డైలాగ్స్ పక్కన పెడితే సిరీస్ మొత్తంలో ప్రేక్షకుడికి నచ్చే ఒకే ఒక్క ఎపిసోడ్ మొదటిదైన 'బెనిఫిట్ షో'. ఈ ఒక్కటి మినహా ఏదీ అంతలా ఆకట్టుకోలేకపోయింది. సినిమాటోగ్రఫీ దానికదే ప్రత్యేకంగా ఉంది. స్మరణ్ సాయి సంగీతం పర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు
కేరాఫ్ కంచెరపాలెం మూవీతో మంచి హిట్ కొట్టిన డైరెక్టర్ వెంకటేశ్ మహా నటుడిగా పలు సినిమాలు చేసాడు. ఈ సిరీస్ లో ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రంగ పాత్రలో వెంకటేశ్ మహా ఒదిగిపోయాడు. కలర్ ఫోటో తో అందరికి సుపరిచితమైన సుహాస్.. ఈ సిరీస్ తో మరోసారి ఆకట్టుకున్నాడు. రాజీవ్ పాత్రలో తరుణ్ భాస్కర్, పూజా రెడ్డి పాత్రలో మడోన్నా సెబాస్టియన్ పరిధి మేర నటించారు. మధ్యతరగతి ఎమోషన్స్ ని మోసే రాధ పాత్రలో బిందు మాధవి ఆకట్టుకుంది. గిరిధర్ గా ఫణి ఆచార్య నటన బాగుంది. ఇక సపోర్ట్ గా చేసిన మిగతావాళ్ళు ఉన్నంతలో బాగా చేసారు. 

తెలుగువన్ పర్ స్పెక్టివ్
ఒంటరిగా చూసేవారికి ఒక్క మొదటి ఎపిసోడ్ బాగుంటుంది. మిగతా మూడు ఎపిసోడ్ లు ఫ్యామిలీతో కలిసి చూస్తే యాంగర్ ని తెప్పిస్తాయి. ఈ సిరీస్ ఒక్కసారి చూడటం కూడా సహనానికి పరీక్షే అవుతుంది.

రేటింగ్: 2/5

- దాసరి మల్లేశ్

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.