ఘనంగా యాంకర్ లాస్య వివాహం
on Feb 15, 2017
బుల్లితెరపై తన అల్లరితో స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న లాస్య వివాహం ఆమెప్రియుడు మంజునాథ్‌తో అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ వింటేజ్ ప్యాలెస్‌లోని గ్రాండ్ మేనర్లో ఉదయం 11.02 గంటలకు వేద మంత్రోచ్ఛరణల మధ్య లాస్య మెడలో ముడుముళ్లు వేశాడు మంజునాథ్. ఈ వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన బంధుమిత్రులు, టీవీ, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. గత నెల 30 వ తేదిన లాస్య, మంజునాథ్‌ల ఎంగేజ్మెంట్ జరిగింది. కొత్తగా పెళ్లవ్వడంతో కొన్ని రోజులు బుల్లితెరకు, వివిధ కార్యక్రమాలకు లాస్య దూరంగా ఉండనుందట. కొద్ది రోజులు భర్తతో కలిసి హానీమూన్ ట్రిప్ ప్లాన్ చేసిందట లాస్య. సో కొద్దిరోజులు లాస్య అభిమానులకు నిరాశ తప్పదు.