"అర్జున్ రెడ్డి"ని కెలికిన అనసూయ.... ఫ్యాన్స్ ఫైర్...
on Aug 31, 2017
"అర్జున్ రెడ్డి" సినిమాకు ఓ పక్క పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. మరోపక్క మాత్రం ఎంతో కొంత నెగిటివ్ టాక్ వస్తూనే ఉంది. వీహెచ్ లాంటి వాళ్లు విమర్శలు గుప్పించినా.. వర్మ నుండి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఒక పక్క కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్నా.. అదే విధంగా వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పుడు వివాదాల్లోకి యాంకర్ అనసూయ కూడా దూరింది. ఒక పక్కసినిమా బావుంది అని చెబుతూనే మరోపక్క చురకలు అంటించింది. సినిమా బాగానే ఉంది అంటూ.. పబ్లిక్ ఫంక్షన్లలో వారు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. మీ ఇంట్లోని ఆడవాళ్లని ఎవరైనా తిడితే ఊరుకుంటారా? అమ్మనో, చెల్లినో తిడితే మీరు ఊరుకోనప్పుడు.. పరాయి ఆడవాళ్లతో మీరు అలా వ్యహరిస్తే ఎలా అని ప్రశ్నించింది. అమ్మను ఎవరైనా తిడుతుంటే.. ఫర్వాలేదు అనుకుంటారా? అంటూ చురకలు అంటించింది. అంతేకాదండోయ్ ఓ సలహా కూడా ఇచ్చింది. లక్షలాది మంది సినిమాను ఇష్టపడుతున్నారు బాగానే ఉంది. ప్రయోగాలు చేయండి కాదనడం లేదు. కాకపోతే బాధ్యతగా వ్యవహరించండి అంటూ సలహా ఇచ్చింది. మీరు వాస్తవాలను గ్రహించాలనే తప్పితే.. ఈ విషయంలో రాద్ధాంతం చేసే ఉద్దేశమేం లేదని ట్వీట్ చేసింది. మరి ఇన్ని సలహాలు, సూచనలు ఇస్తే అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ ఊరుకుంటారా..? అనసూయపై మండిపడుతున్నారు. టీవీ షోల్లో మీరు ఎలాంటి దుస్తులు వేసుకొని వేస్తున్నారు...జబర్దస్త్ షోలో ఆడవాళ్లపై వేస్తున్న కుళ్లు జోకుల సంగతి ఏంటని ప్రశ్నించారు.