చెప్పు తెగుద్ది.. అనసూయ అంటే ఫ్లవర్ అనుకుంటిరా ఫైర్
on Aug 2, 2025

యాంకర్ గా కెరీర్ ని ప్రారంభించిన 'అనసూయ భరద్వాజ్'(Anasuya Bharadwaj)అనతి కాలంలోనే సినిమాల్లోను తన సత్తా చాటుతు వస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' వన్ మాన్ షో 'హరిహర వీరమల్లు'(HariHara Veeramallu)లో పవన్(Pawan Kalyan)తో కలిసి 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ కి సూపర్ గా డాన్స్ చేసి అభిమానులని మెప్పించింది.
రీసెంట్ గా అనసూయ 'ఏపీ'(AndhraPradesh)లోని ప్రకాశం జిల్లా 'మార్కాపురం'(Markapuram)లో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళింది. దీంతో అనసూయని చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మాల్ ఓపెనింగ్ అనంతరం అభిమానులని ఉద్దేశించి ఆమె మాట్లాడుతుంది. ఆ సమయంలో కొంత మంది యువకులు అనసూయని ఉద్దేశించి అసభ్య కామెంట్స్ చేసారు. వెంటనే అనసూయ వాళ్ళపై ఫైర్ అవుతు 'వల్గర్ గా మాట్లాడితే చెప్పుతెగుద్ది. కిందకి దిగి కొట్టమన్నాకొడతాను. మీ తల్లిని, చెల్లిని, భార్యని ఎవడైనా ఏడిపిస్తే బాగుంటుందా. పదండి మీ ఇంటికి వెళ్లి మీ అమ్మతో మాట్లాడదాం. మీ అందరు చిన్న పిల్లలు. ఇప్పుడే ఇలా ఉన్నారంటే కొంచం పెద్దయ్యాక ఎలా ఉంటారో. మీతో ఈ సమాజానికి అవసరమే లేదు. నాకు చాలా కోపంగా ఉంది. మీ కోసం ఏడు గంటలు ప్రయాణం చేసి వస్తే ఇలాగేనా ప్రవర్తించేది అంటూ ఫైర్ అయ్యింది. ఇందుకు సంబంధించి అనసూయ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అసభ్య కామెంట్స్ పట్ల అనసూయ మాట్లాడిన తీరుని పలువురు నెటిజన్స్ అభినందిస్తు కామెంట్స్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



