అభిమానంతో వస్తే అవమానించిన అనసూయ
on Feb 6, 2018
.jpg)
జబర్దస్త్‌తో తెలుగు నాట ఫేమస్ అయ్యింది అనసూయ.. బుల్లితెరతో పాటు వెండితెరపైనా మెరుస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. చిన్నారుల నుంచి పెద్ద వారి వరకు.. ఈ ముద్దుగుమ్మను అభిమానిస్తారు. ఇష్టమైన వారు ఎదురుగా కనిపిస్తే.. వారి ఆటోగ్రాఫ్ తీసుకోవడమో లేదంటే సెల్ఫీ దిగడమో చేస్తుంటారు ఫ్యాన్స్. అలా అనసూయతో సెల్ఫీ దిగాలని ముచ్చటపడిన ఓ చిన్నారి కోరికను ఆమె తిరస్కరించింది. అంతటితో ఆగకుండా.. ఆ చిన్నారి చేతిలోని ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టింది.
అసలు మ్యాటర్‌లోకి వెళితే.. వ్యక్తిగత పనికోసం అనసూయ తార్నాకకి వెళ్లింది. అక్కడి రోడ్డుపై ఎవరితోనో మాట్లాడుతోంది. ఈ సమయంలో అటుగా వెళ్తోన్న చిన్నారి.. అనసూయను గుర్తుపట్టి ఫోన్‌తో ఫోటోలు తీసి.. సెల్ఫీ దిగేందుకు దగ్గరకు వెళ్లాడు.. దీనిని గమనించిన అనసూయ.. ఫోటోలు తీస్తావా అంటూ ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టింది. ఈ తతంగాన్ని దూరం నుంచి చూస్తోన్న బాలుడి తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి.. అనసూయతో వాగ్వివాదానికి దిగింది. జనం పొగవ్వడంతో జబర్దస్త్ యాంకర్ కారెక్కి వెళ్లిపోయింది. దీనిని అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. సెల్ఫీ దిగితే దిగాలి.. లేదంటే లేదని చెప్పాలి.. అంతే కానీ ఈ రకంగా ప్రవర్తించడం సరికాదని కొందరంటుంటే.. ప్రేక్షకుల ఆదరణతోనే ఈ స్థాయికి వచ్చి.. ఇప్పుడు వారిపై వీరంగం వేయడం ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అనసూయపై పోలీస్‌స్టేషన్‌లోనూ కంప్లయింట్ చేసింది చిన్నారి తల్లి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



