మళ్లీ రెచ్చిపోతున్న అనసూయ!
on Feb 2, 2022

బుల్లి తెర మీద.. యాంకర్ అవతారం ఎత్తింది. ఆ తర్వాత వెండి తెర మీద.. అలా అలా మెరిసింది. ఆ క్రమంలో పలు చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటిస్తోంది అనసూయ. సుకుమర్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా అనసూయ ఎంత క్రేజ్ తెచ్చుకుందో.. అలాగే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప పార్ట్ వన్‌లో దాక్షాయణిగా అనసూయ విలక్షణంగా నటించింది. ఇక పుష్ప రెండో భాగంలో సైతం అనసూయ పాత్ర తీవ్ర ఆసక్తి రేపుతోందని సమాచారం.
మరోవైపు.. మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం ఖిలాడి. ఈ చిత్రంలో అనసూయ డబుల్ రోల్‌లో నటిస్తోందని తెలుస్తోంది. ఖిలాడిలో అనసూయ మొదటి పాత్ర రెబల్ పాత్ర అయితే.. రెండో పాత్ర మాత్రం సాధారణ బ్రహ్మణ యువతిగా.. చాలా పొందికగా ఉంటుందని సమాచారం. అయితే ఈ చిత్రంలో ఓ పాత్ర చనిపోతుందని.. రెండో పాత్ర మాత్రం సినిమా చివరి వరకు ఉంటుందని తెలుస్తోంది. ఓ విధంగా ఈ చిత్రంలో అనసూయకి ఫుల్ లెంత్ రోల్ దొరికినట్లు సమాచారం.
ఇక క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం రంగమార్తాండ. ఈ చిత్రంలో కూడా అనసూయ.. తన టాలెంట్ చూపుతోందట. అలాగే మలయాళంలో మమ్ముటి నటిస్తున్న భీష్మ పర్వంలో కూడా అనసూయ నటిస్తోంది. ఇక తమిళంలో విజయ్ సేతుపతి నటిస్తోన్న చిత్రంలో కూడా అనసూయ.. ఓ వెరైటీ పాత్ర చేస్తుంది... ఏమైనా బుల్లి తెర మీద యాంకర్‌గా ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న అనసూయ.. వెండి తెర మీద కూడా ఎక్కడా తగ్గేదే లే అన్నట్లు దూసుకుపోతుందని.. ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



