రౌడీ హీరోయిన్ అంత బిజీ అయిపోయిందా?
on Jun 27, 2023

రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఆయన హీరోయిన్ అనన్య పాండే. అవును, మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నది మిస్ పాండే గురించే. లైగర్ సినిమా తర్వాత అనన్య పాండే పత్తా లేకుండా పోయిందని చాలా మంది అనుకున్నారు. కానీ ఒక్కడుగు వెనక్కి వేసింది పది అడుగులు ముందుకు వేయడానికే అనే సిగ్నల్స్ జాగ్రత్తగా పంపిస్తున్నారు మిస్ బ్యూటీ. అనన్య పాండే చేతిలో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయన్నది అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్న విషయం. చుంకీ పాండే కూతురుగా సినీ ఎంట్రీ ఇచ్చారు అనన్య పాండే. వరుస అవకాశాలు కూడా అలా వచ్చినవే అని అనుకున్నారు అంతా. అయితే ఫిట్‌నెస్ మెయింటెయిన్ చేస్తూ, డిసిప్లిన్ ఉన్న అమ్మాయని పేరు తెచ్చుకుంటూ, ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకున్నారు అనన్య. సినిమా సక్సెస్‌లు, ఫ్లాప్‌లూ ఆమె చేతిలో ఉండవు కాబట్టి, ఆ దిశగా ప్రేక్షకులు పెద్దగా ఆలోచించలేదు.
ఈ ఏడాది ఫస్టాఫ్లో అనన్య కాస్త బిజీగానే గడిపారు. ఫిబ్రవరిలోనే ఆమె విక్రమాదిత్య మోత్వానీ సైబర్ థ్రిల్లర్ సినిమాను పూర్తి చేశారు. తమ సినిమా షూటింగ్ పూర్తయిన విషయాన్ని డైరక్టర్ ఫొటో షేర్ చేసి మరీ చెప్పారు. ఈ సినిమా తర్వాత ఆయుష్మాన్ ఖురానాతో డ్రీమ్ గర్ల్ 2 చేశారు అనన్య. నష్రత్ బరూచా సినిమా ఆగస్టులో విడుదల కానుంది. అనన్య, అక్షయ్ కలిసి ఓ సినిమా షూటింగ్ చేశారు. ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సి శంకరన్ నాయర్ అనేది ఆ సినిమా పేరు. కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. అక్షయ్ లీడ్ రోల్ చేస్తున్నారు. లాయర్ యాక్టివిస్ట్ గా కనిపిస్తారు ఆయన. యంగ్ లాయర్‌గా చేస్తున్నారు అనన్య. కో గయే హమ్ కహాన్ అనే సినిమాలో సిద్ధాంత్, ఆదర్శ్ గౌరవ్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమాను జోయా అక్తర్, రీమా కగ్టి, రితీష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ కలిసి చేస్తున్నారు. వీటన్నిటితోపాటు ఓటీటీ ప్రాజెక్ట్ కాల్ మీ బేలోనూ నటించారు అనన్య. సౌత్‌లో ఆశించినన్ని అవకాశాలు రాకపోయినా, నార్త్ లో మాత్రం ఫుల్ బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



