టీచర్‌గా విజయ్ దేవరకొండ తమ్ముడు
on Jan 31, 2020
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గుర్తున్నాడా? 'దొరసాని'తో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చూడండి! ఇప్పుడు అతడు గవర్నమెంట్ టీచర్ గా చేస్తున్నాడు. రియల్ లైఫ్ లో కాదు. రీల్ లైఫ్ లో. ఒక సినిమాలో ఈ యంగ్ హీరో గవర్నమెంట్ టీచర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. 'దొరసాని'తో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత మరో రెండు సినిమాలకు సంతకం చేశాడు. అందులో వినోద్ ఆనంతోజు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఫ్యామిలీ డ్రామా సినిమా షూటింగ్ పూర్తయింది.
దామోదర అట్టాడ దర్శకత్వం వహిస్తున్నమరో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమాలో ఆనంద్ దేవరకొండ టీచర్ రోల్ చేస్తున్నాడు. ప్రజెంట్ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో షూటింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ 25 శాతం సినిమా షూటింగ్ పూర్తి అయింది. హీరో క్యారెక్టర్ సింపుల్ గా ఉన్నప్పటికీ... కామెడీ ఫుల్లుగా ఉంటుందట. ఇందులో ఆనంద్ దేవరకొండ పక్కన కొత్త అమ్మాయిలు ఇద్దరు గీతా సాయిని, శాన్వీ మేఘన నటిస్తున్నారు.