ENGLISH | TELUGU  

చూసీ చూడంగానే మూవీ రివ్యూ

on Jan 31, 2020

నటీనటులు: శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ, మాళవిక సతీషన్, పవిత్రా లోకేష్, అనీష్ కురువిల్ల, అవసరాల శ్రీనివాస్, వెంకటేష్ కాకుమాను తదితరులు
మాటలు: పద్మ 
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, విశ్వ
సినిమాటోగ్రఫీ: రవితేజ గిరజాల, వేదరమణ్ 
సంగీతం: గోపిసుందర్
నిర్మాత: రాజ్ కందుకూరి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శేష సింధు రావ్ 
విడుదల తేదీ: 31 జనవరి 2020

'పెళ్లి చూపులు'తో జాతీయ అవార్డును, పెద్ద విజయాన్ని అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి. తర్వాత 'మెంటల్ మదిలో'తో మరో విజయాన్ని అందుకున్నారు. కొత్తవాళ్లతో చిన్న సినిమాలు తీసి పెద్ద పెద్ద విజయాలు అందుకున్న రాజ్ కందుకూరి.. అందరూ కొత్తవాళ్లతో నిర్మించిన తాజా సినిమా 'చూసీ చూడంగానే'. ఈ సినిమాతో ఆయన కుమారుడు శివ కందుకూరి హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? 

కథ:

సిద్ధు (శివ కందుకూరి)కి ఇంజనీరింగ్ అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు. కానీ, ఇంట్లో అమ్మ (పవిత్రా లోకేష్) ఫోర్స్ చేసిందని జాయిన్ అవుతాడు. కాలేజీలో ఐశ్వర్య (మాళవికా సతీషన్) పరిచయం అవుతుంది. ఇద్దరు ప్రేమలో పడతాడు. ఫైనల్ ఇయర్ వచ్చేసరికి బ్రేకప్ అవుతుంది. ఈ ఫ్రస్టేషన్ లో సిద్ధు పరీక్షలు రాయకుండా ఆన్సర్ షీట్ చించేసి వస్తాడు. ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ కావాలనుకుని చివరికి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అవుతాడు. ఆ టైమ్ లో అతడికి శృతి (వర్ష బొల్లమ్మ) పరిచయం అవుతుంది. శృతితో పరిచయం సిద్ధు జీవితంలో ఎటువంటి మార్పు తీసుకొచ్చింది. అసలు, ఆమె ఎవరు? ఇద్దరి మధ్య దూరం ఎందుకు పెరిగింది? అనేది మిగతా సినిమా.

విశ్లేషణ:

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. అలాగే, ఓ అబ్బాయితో ప్రేమలో ఉంటూ మరో అబ్బాయితో ఎఫైర్ పెట్టుకున్న అమ్మాయి కథలతోనూ సినిమాలు చాలా వచ్చాయి. ఓ అబ్బాయి జీవితంలో అతడికి తెలియకుండా ఇటువంటి రెండు కథలు జరిగితే 'చూసీ చూడంగానే'. రొటీన్ కథలకు కొంచెం కొత్త ట్రీట్మెంట్ ఇవ్వడానికి దర్శకురాలు శేష సింధు రావ్ ప్రయత్నించారు. కానీ, ఇవ్వలేకపోయారు. అసలు సినిమా ఎలా ఉంది? అనే విషయంలోకి వెళితే... ఇదొక సింపుల్, రొటీన్ స్టోరీ. కాలేజీలో చేరిన కొత్తలో హీరో ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. బ్రేకప్ అవుతుంది. మూడేళ్ల తర్వాత మళ్లీ మరో అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి మరో అబ్బాయితో నిశ్చితార్థానికి సిద్ధమవుతుంది. చివరికి, ఈ ప్రేమకథ ఎలా కంచికి చేరిందనేది సినిమా. మొదటి ప్రేమకథ మరీ రొటీన్ గా ఉంటుంది. రెండో ప్రేమకథలో డైలాగుల్లో కొంచెం అక్కడక్కడా కొత్తదనం ఉంటుంది. అయితే... ఈ రెండు ప్రేమకథలకు ఒక కనెక్షన్ ఉంటుంది. హీరోయిన్ల విషయంలో ఒక ట్విస్ట్ ఉంది. అదేంటో తెరమీద చూడాలి. ఈ రొటీన్ కథలో ప్రేక్షకులకు కొంత రిలీఫ్ అంటే మ్యూజిక్. గోపిసుందర్ మంచి మెలోడీలు ఇచ్చాడు. నేపథ్య సంగీతం కూడా బావుంది. నిర్మాణ విలువలు ఉన్నతస్థాయిలో ఉన్నాయి. 

ప్లస్ పాయింట్స్:
హీరో హీరోయిన్లు
సంగీతం
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ, సీన్స్
దర్శకత్వం
కామెడీ ఎక్కువ లేకపోవడం

నటీనటులు:

శివ కందుకూరికి తొలి చిత్రమైనా... చక్కటి నటన కనబరిచాడు. పాత్రకు తగ్గట్టు సినిమా ప్రారంభంలో క్యూట్ బాయ్ గా, తర్వాత గడ్డం పెంచి మ్యాన్లీగా కనిపించాడు. పతాక సన్నివేశాలకు ముందు పవిత్రా లోకేష్ తో ఎమోషనల్ సీన్ బాగా చేశాడు. నెక్స్ట్ ఫిలిమ్స్ లో ఇంకా షైన్ అవుతాడు. శ్రుతి పాత్రలో వర్ష బొల్లమ్మ అద్భుతంగా నటించింది. ఆమె నటన వల్ల కొన్ని సీన్స్ అందంగా వచ్చాయి. మాళవికా సతీషన్ హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. తనకు అవకాశం దొరికిన సీన్స్ లో వెంకటేష్ కాకుమాను నవ్వించాడు. సెకండాఫ్ లో ఒక సీన్ కి అయితే ప్రతి ఒక్కరూ నవ్వుతారు. పవిత్రా లోకేష్, అనీష్ కురువిల్ల పాత్రలకు తగ్గట్టు నటించారు. అతిథి పాత్రలో అవసరాల శ్రీనివాస్ నటించారు. 

తెలుగుఒన్ పర్స్పెక్టివ్:

'చూసీ చూడంగానే' ఒక సింపుల్ లవ్ అండ్ ఎమోషనల్ స్టోరీ. కథ రొటీన్, సీన్స్ రొటీన్ గా ఉన్నప్పటికీ... హీరో హీరోయిన్లు కొత్తవాళ్లు కావడం సినిమాకు ప్లస్ అయింది. గోపిసుందర్ సంగీతం బావుంది. కొత్తవాళ్లను ప్రోత్సహించాలని అనుకునేవాళ్లు ఒక్కసారి ఆలోచించుకుని సినిమాకు వెళ్లండి.

రేటింగ్: 2/5

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.