Home

»

Latest News

వ్యభిచార కేసులో అడ్డంగా బుక్కైన ప్రముఖ హీరోయిన్..ఎవరెవరు ఉన్నారంటే!

Sep 28, 2026 2:40PM

 

 

 

 మహారాష్ట్రలోని థానే నగర పరిధిలో ఒళ్ళు గగుర్పొడిచే సంచలన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హిందీ వెబ్‌సిరీస్‌లతో పాటు భోజ్‌పురి సినిమాల్లో నటిగా మంచి పేరు సంపాదించుకున్న ఒక హీరోయిన్, అనూహ్యంగా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తూ పోలీసులకు చిక్కిన ఉదంతం ఇప్పుడు సినీ పరిశ్రమలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. 

వాగ్లే ఎస్టేట్ ప్రాంతంలో ఉన్న ఒక బార్ అండ్ రెస్టారెంట్‌లో అక్రమ కార్యకలాపాలు సాగుతున్నాయని థానే పోలీసులకి సమాచారం అందింది. దీంతో సీక్రెట్ టీమ్‌తో ఒక పక్కా 'డీకాయ్' ఆపరేషన్‌  ప్లాన్ చేశారు. పోలీసులు వేసిన పథకంలో సదరు నటి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కుకోవడంతో అధికారులు ఆమెని  అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు మహిళలని కూడా పట్టుకోవడం జరిగింది. 

అరెస్టయిన నటి నేపథ్యాన్ని పరిశీలిస్తే  ఇప్పటివరకు దాదాపు 10 హిందీ వెబ్‌సిరీస్‌లు, మూడు ప్రజాదరణ పొందిన భోజ్‌పురి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. వెండితెరపై మరియు డిజిటల్ మాధ్యమాల్లో ఎంతో గ్లామరస్‌గా కనిపించే ఈ నటి, తెర వెనుక మాత్రం ఇలాంటి అక్రమ నెట్‌వర్క్‌ను నడుపుతోందని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ దందా వెనుక జరుగుతున్న ఆర్థిక లావాదేవీల అసలు రంగు బయటపడింది. సదరు నటి ప్రతి విటుడి నుంచి  25,000 వరకు భారీ మొత్తంలో వసూలు చేసేది. ఈ మొత్తంలో  10,000 మాత్రమే పనిచేసే మహిళలకు చెల్లించి, మిగిలిన 15,000 తన కమీషన్‌. సదరు హీరోయిన్ నే స్వయంగా విచారణలో ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు.


ఇది కూడా చదవండి: Sardar 2: సర్దార్ 2 ఓటిటి డేట్ వచ్చేసింది. వాళ్ళకి పండగే   


ప్రస్తుతం ఈ ఘటనపై శ్రీనగర్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా కేసు నమోదు చేసి  దర్యాప్తు జరుపుతున్నారు. రక్షించబడిన ఇద్దరు మహిళల వాంగ్మూలాలను పోలీసులు వివరంగా నమోదు చేసుకున్నారు. వారు ఈ వ్యభిచార కూపంలోకి ఎలా వచ్చారు, వారిని ఎవరైనా మోసం చేసి తీసుకువచ్చారా అనే కోణాల్లో విచారణ సాగుతోంది. అంతేకాకుండా, అరెస్టయిన నటి బ్యాంక్ ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు మరియు ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తూ, ఈ రాకెట్ వెనుక ఇంకా పెద్ద స్థాయి వ్యక్తులు లేదా అంతరాష్ట్ర నెట్‌వర్క్ ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసు అధికారులు తమ దర్యాప్తుకి పదును పెట్టారు.

 

[Actress Arrested Prostitution Racket Thane, actress arrested, prostitution racket bust, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com