అమితాబ్.. కింగ్ ఆఫ్ ఫేక్ న్యూస్!
on Apr 7, 2020

సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్‌ను రిట్వీట్ చేయడం ద్వారా షేర్ చేసిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరోసారి విమర్శల పాలయ్యారు. ఆదివారం వరల్డ్ మ్యాప్‌లో వెలిగిపోతున్న ఇండియాను తప్పుగా చూపిస్తూ ట్విట్టర్‌లో ఒకరు చేసిన పోస్ట్‌ను ఆయన రిట్వీట్ చేశారు. ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు పాటు ఇళ్లల్లోని విద్యుద్దీపాలను ఆర్పివేసి ప్రమిదల దీపాలు, కొవ్వొత్తులు, టార్చిలైట్లు, మొబైల్ ఫ్లాష్‌ల లాంటి వాటిలో దేన్నయినా వెలిగించి, కరోనా వైరస్ పోరాటంలో భారతీయుల సమైక్యతను చాటాలని శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
దానికి తగ్గట్లు ఆదివారం దీపాలు, కొవ్వొత్తుల వెలుగులో దేశమంతా వెలుగులీనుతున్నట్లు చూపించే ఒక ట్వీట్‌ను అమితాబ్ బచ్చన్ షేర్ చేశారు. అది ఫేక్ న్యూస్ అని ఆయనకు తెలీదు. దాంతో ఆయనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తాయి. "ఒక వాట్సాప్ ఫార్వర్డ్ న్యూస్‌ను ప్రశంసించడం ద్వారా 'కింగ్ ఆఫ్ ఫేక్ న్యూస్' మళ్లీ వచ్చారు. ఆయనను సస్పెండ్ చేసి, రోజువారీ ఎంబరాస్‌మెంట్ నుంచి మమ్మల్ని కాపాడమని ట్విట్టర్ ఇండియాను రిక్వెస్ట్ చేస్తున్నా" అని ఒకతను పోస్ట్ చేశాడు. మూడు వారాల వ్యవధిలో అమితాబ్ ఫేక్ న్యూస్‌ను షేర్ చేసి ట్రోల్‌కు గురవడం ఇది మూడోసారి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



