
గత కొంతకాలంగా అమలాపాల్ - విజయ్ ల విడాకులు తప్ప మరో టాపిక్ లేకుండాపోయింది చెన్నై ఫిల్మ్ వర్గాలకు. అంత ఇదిగా ప్రేమించి పెళ్లి చేసుకొన్న జంట.. ఇంత త్వరగా ఎందుకు విడిపోయారు, కారణాలేంటి? అనే విషయంపై తెగ ఆరాలు తీశారు. తప్పెవరిది? అనే విషయంలో తమిళనాట పెద్ద డిబేటే జరుగుతోంది. ఒకవేళ అమలాపాల్ విడిపోయినా... భారీ ఎత్తున భరణం వసూలు చేస్తుందని, కనీసం రూ.10 కోట్లయినా డిమాండ్ చేయడం ఖాయమని చెప్పుకొన్నారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అమలాపాల్ - విజయ్‌ల విడాకుల వ్యవహారం కోర్టు ముందుకు వెళ్లింది. ''మాకు విడాకులు ఇప్పించండి'' అంటూ ఇద్దరూ కోర్టుని అభ్యర్థించారు. అయితే అమలాపాల్ పిటీషన్‌లో భరణం గురించి ఏమీ పేర్కొనలేదట. 'నాకు భరణం వద్దు' అని అమలాపాల్ లిఖిత పూర్వకంగానే కోర్టుకు విన్నవించుకొంటోందట. అమలాపాల్ కోరితే... కనీసం పది కోట్లయినా వస్తుంది. అయినా సరే.. దానిపై విముఖత చూపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. విజయ్ కోసం అమలాపాల్ మరో త్యాగం చేసిందని తమిళ సినీ వర్గాలు గుసగుసలాడుకొంటున్నాయి. అయితే ఈ విషయంలో తప్పంతా అమలాపాల్‌దే అని, అందుకే భరణం అడగడానికి ధైర్యం చాల్లేదని చెప్పుకొంటున్నవాళ్లూ ఉన్నారు. నిజమేంటో వాళ్లిద్దరికే తెలియాలి.





