డైలాగుల్లో ప్రాసలు ఎక్కువైపోతున్నాయ్ బాబోయ్ అని భయపడిపోతుంటే... ఈమధ్య కొన్ని టైటిళ్లూ అలానే షాకిస్తున్నాయి. రైమింగుల కోసం తెగ పాట్లు పడుతూ.. టైటిల్‌తోనే ముప్పు తిప్పలు పెడుతున్నారు దర్శక నిర్మాతలు. అలాంటి టైటిలే ఇప్పుడొకటి వచ్చింది. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన చిత్రం విక్కీ డోనర్. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని ఏళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ సినిమాని తెలుగులో సుమంత్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. టైటిల్ ఏంటో తెలుసా..? 'నారీ నారీ డొనారీ..' అట. డోనర్ అన్నమాట టైటిల్‌లో రావాలని పనిగట్టుకొని పెట్టిన పేరు ఇది. దానికి తోడు రైమింగ్ కోసం నారీ నారీని కలిపారు. దాంతో ఈ టైటిల్ మొత్తం కృతకంగా మారిపోయింది. ఈ టైటిల్ విని.. ఎలా స్పందించాలో తెలీక నోరెళ్లబెడుతున్నారంతా. ఈ కథ ముందు నానికి వినిపించారు. కొన్నాళ్లు తిప్పుకొన్న నాని చివరికి నో చెప్పాడు. ఆ తరవాత సునీల్‌కి వెళ్లింది. ఇప్పుడు సుమంత్ చేస్తున్నాడు. ఏమో గుర్రం ఎగరావొచ్చు తరవాత సుమంత్ మరో సినిమా ముట్టుకొనే ధైర్యం చేయలేదు. రీమేక్ సబ్జెక్ట్ కాబట్టి. మినిమం గ్యారెంటీ ఉంటుందని కాబట్టి.. ఇలా సాహసానికి ఒడిగట్టాడు సుమంత్. విక్కీ డోనర్ అన్నది అరిగిపోయిన సబ్జెక్ట్. కొత్త కథే అయినా.. బాలీవుడ్‌లో ఎప్పుడో వచ్చింది. ఆ కథ గురించి అందరికీ తెలుసు. వేడి మీద ఉన్నప్పుడే ఆ సినిమాని రీమేక్ చేయాల్సింది. కానీ బాగా ఆలస్యమైపోయింది. దానికి టైటిల్ కూడా ఏదోలా ఉంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో??
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com






