Home

»

Latest News

న‌య‌న అంటే వెంకీకి అంత ముద్దా?

Aug 9, 2016 12:51PM

న‌య‌న‌తార గొప్ప న‌టే కావొచ్చు. కానీ... నిర్మాత‌ల్ని తెగ ఇబ్బంది పెడుతుంటుంది. చెప్పిన స‌మ‌యానికి షూటింగ్ కి రాదు. ప్ర‌మోష‌న్ల‌లో క‌నిపించ‌దు. కోట్ల‌కు కోట్లు పారితోషికం అందుకొని.. సినిమా చివ‌రికి వ‌చ్చే స‌రికి మొండి చేయి చూపిస్తుంటుంది. న‌య‌న వైఖ‌రి న‌చ్చ‌కే ఆమెతో సినిమాలు చేయ‌డ‌మే మానేశారు. బాబు బంగారం ద‌ర్శ‌క నిర్మాత‌ల్ని కూడా న‌య‌న హ‌డ‌లెత్తించింద‌ట‌. ఆమె వ‌ల్లే షూటింగ్ ఆల‌స్య‌మైంద‌ట‌. ఆఖ‌రికి ఆడియో ఫంక్ష‌న్‌కీ డుమ్మా కొట్టింది. ఇదే విష‌యాన్ని వెంక‌టేష్ ని అడిగితే.. ''న‌య‌న వైఖ‌రి ముందు నుంచీ అంతే. ఇందులో కొత్త‌గా చేసిందేం లేదు. త‌ను ఎప్పుడూ ప్ర‌మోష‌న్ల‌కు రాదు. ఈ విష‌యంలో న‌య‌న‌ను త‌ప్పుప‌ట్టాల్సిన ప‌ని లేదు. త‌న ష‌ర‌తులు త‌న‌కుంటాయి. అవ‌న్నీ ఒప్పుకొనే క‌దా సినిమాలో తీసుకొన్న‌ది'' అంటున్నాడు. న‌య‌న అంటే వెంకీకి అంత ముద్దు ఏంటో మ‌రి. అదే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ తో సినిమా చేసినప్పుడు ఇలానే హ్యాండిస్తే.. వెంకీ ఊరుకొంటాడా??  నిర్మాత‌ల ప‌ట్ల త‌న వైఖ‌రి ఎలా ఉన్నా.. న‌య‌న మంచి న‌టి అని కితాబివ్వ‌డంలో అర్థం ఏమిటో మ‌రి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com