వివాదంలో అల్లుఅర్జున్..?
on Jun 2, 2017
హరీశ్ శంకర్ దర్శకత్వంలో స్టైలీస్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా దువ్వాడ జగన్నాధమ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో బన్నీ ఓ బ్రాహ్మణ యువకుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇటీవల ఈ సినిమాలోని ఓ సాంగ్‌ను రిలీజ్ చేశారు. " బడిలో గుడిలో " అంటూ సాగే ఆ పాటకు బన్నీ అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే ఈ పాటలో బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలా సాహిత్యం ఉందంటూ కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా శివుడిని పూజించే సమయంలో వాడే కొన్ని మంత్రాలను ఈ పాటలో వినియోగించారంటూ ఆరోపిస్తున్నారు. కానీ ఇంతవరకు చిత్రయూనిట్ ఈ వివాదంపై అధికారికంగా స్పందించలేదు.