పుష్పరాజ్ ఈసారి కూడా తగ్గేదే లే అంటున్నాడు!
on Jan 31, 2023
పుష్ప.... పుష్ప రాజ్ గా తెలుగు సినిమా ప్రేక్షకులను అల్లు అర్జున్ ఎంతో ఆలరించారు. పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ కొట్టారు. బన్నీ, రష్మిక మందన కలిసి సుకుమార్‌తో కలిసి మ్యాజిక్ చేశారు. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. తగ్గేదేలే అంటూ ఏ బిడ్డా... ఇది నా అడ్డా.. పలుకే బంగారమాయెనే శ్రీవల్లీ... సామి సామి... ఊ అంటావా ఊఊ అంటావా వంటి పాటలు విపరీతమైన క్రేజ్‌ను అందుకున్నాయి. దీనికి సీక్వెల్ అయిన పుష్ప2 ది రూల్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఐదు రోజుల షెడ్యూల్ జరిగింది. తాజాగా రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ చిత్రం యూనిట్ ప్రస్తుతం విశాఖలో ఉన్నారు. అల్లు అర్జున్ తో పాటు ఇతర తారాగాణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
అల్లు అర్జున్ పై వచ్చే హీరో ఇంట్రడక్షన్ చిత్రీకరిస్తున్నారు. ఈసారి కూడా అల్లు అర్జున్ మాంచి కిక్ ఇచ్చే పాటతోనే ఎంట్రీ ఇవ్వనున్నాడట. ఫిబ్రవరిలో హీరోయిన్ రష్మిక మందనాకి సంబంధించిన షూటింగ్ ప్రారంభమవుతుంది. పుష్పా1 ది రైజ్ కంటే పుష్ప2 ది రూల్ చిత్రం మరింతగా బాగుంటుందని అందరూ భావిస్తున్నారు. సాంగ్స్, డైలాగ్స్ తో సుకుమార్ మరోసారి సూపర్ హిట్ కొడతాడని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని సినిమాలు తీస్తున్నారు. 2024 వేసవిలో సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు. రష్యాలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాటు చేస్తోంది.
Also Read