'ఆదిపురుష్'తో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ గ్రాండ్ లాంచ్!
on May 31, 2023
టాలీవుడ్ కి చెందిన పలువురు స్టార్లు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ బిజినెస్ పట్ల వారు ఆసక్తి చూపుతున్నారు. ఓ రకంగా హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్ వైపు అడుగులు వేయడానికి కారణం ఏషియన్ సినిమాస్ అని చెప్పొచ్చు. ఇప్పటికే ఏషియన్ సంస్థ, మహేష్ బాబుతో కలిసి హైదరాబాద్ లో ఏఎంబీ సినిమాస్, విజయ్ దేవరకొండతో కలిసి ఏవీడీ సినిమాస్ ని ప్రారంభించింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది.
ఒకప్పుడు అమీర్ పేట్ లో సత్యం థియేటర్ కి ఎంతో క్రేజ్ ఉండేది. అయితే ఇప్పుడు ఆ స్థానంలో ఏషియన్ సత్యం మాల్ రాబోతుంది. దానిలోనే 'ఏఏఏ సినిమాస్' అనగా 'ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్' అందుబాటులోకి రానుంది. ఇది ఏఎంబీ మాల్ కి ధీటుగా ఉండనుందని అంటున్నారు. ఇప్పటికే దాదాపు నిర్మాణం పూర్తయ్యి, తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇప్పుడు ఈ ఏఏఏ సినిమాస్ ఓపెనింగ్ కి ముహూర్తం ఖారైనట్లు తెలుస్తోంది. ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన 'ఆదిపురుష్' సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమాతోనే ఏఏఏ సినిమాస్ గ్రాండ్ గా లాంచ్ కానుందని సమాచారం. అంతేకాదు ఈ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ప్రభాస్ హాజరయ్యే అవకాశముంది అంటున్నారు.
Also Read