ట్రైలర్ రివ్యూ: డీజే
on Jun 6, 2017
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ దువ్వాడ జగన్నాధం టీజర్ యూట్యూబ్ లో ఒక ఊపుఊపడంతో, అందరూ ట్రైలర్ కోసం ఉత్కంఠగా ఎదురు చూసారు. అల్లు అర్జున్ కి బ్రాహ్మణ అవతారం బాగానే కుదిరినప్పటికీ, భాష వంటబట్టినట్టు లేదు. ఏదో, కష్టంగా డైలాగులు చెప్పినట్టుగా కనిపిస్తుంది. బ్రాహ్మణ యాసలో మాట్లాడడం అంత తేలికయిన పని కానప్పటికీ, అల్లు అర్జున్ ఇంకొంచెం శ్రద్ధ తీసుకోవాల్సింది. సినిమాలో విపరీతమైన కామెడీ, రొమాన్స్ ఉంటుందని బయట టాక్ వినిపిస్తున్నా... ఎందుకో తెలియదు కానీ ట్రైలర్లో యాక్షన్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు.
సినిమా పైన బజ్ కొంచెం తగ్గించాలనో... లేక కామెడీ ట్రైలర్ విడుదలకి కొంచెం ముందు సపరేట్ గా రిలీజ్ చేద్దామన్న ఉద్దేశ్యంతో ఏమో గాని... ట్రైలర్లో ఎక్కువగా ఫైట్సే కనిపించాయి. పూజా హెగ్డే అయితే, టీజర్ లో కనిపించినంత సేపు కూడా కనిపించలేదు. అయితే ట్రైలర్ లో కొన్ని సంభాషణలు బాగానే అనిపించాయి.
మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ, మనిషి కనపడక్కర్లేదండి... పబ్బుల్లో వాయించే డీజే కాదురా, పగిలిపోయేలా వాయించే డీజేని... సత్యనారాయణపురం అగ్రహారం సాక్షిగా చెబుతున్నాను, నేను వాడిని చుసినా రోజే చంపకపోతే, నేను దువ్వాడ జగన్నాధమే కాదు, నేను శ్రీవత్సస్య గోత్రంలోనే పుట్టలేదు... అని అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు బాగున్నాయి. బ్రాహ్మణ గెటప్ కి ఎలాగయితో సెట్ అయ్యాడో, సూట్లో కూడా బాగున్నాడు అల్లు అర్జున్. జూన్ 23 న వస్తున్నాను, అనే డైలాగ్ తో ట్రైలర్ ముగుస్తుంది. ఈ రకంగా విడుదల తేదీ కూడా చెప్పేసారు. కెమెరా వర్క్, సంగీతం బాగానే ఉన్నాయి. మొత్తానికి, డీజే ట్రైలర్ అనుకున్న స్థాయిలో లేకున్నా ఓ మోస్తరుగా ఉంది. సినిమా మాత్రం బాగుండాలని ఆశిద్దాం.
Also Read