టర్కీలో ఎంజాయ్ చేస్తున్న బన్నీ అండ్ స్నేహ..!
on Jun 6, 2016

అల్లు అర్జున్ సినిమాల్లోనే కాదు, బయట కూడా చాలా స్పీడ్ గా, యాక్టివ్ గా ఉంటాడు. లైఫ్ ను వీలైనంత ఎంజాయ్ చేయాలని భావిస్తుంటాడు. అయితే ఆ మధ్య కాలంలో సరైనోడు షూటింగ్ లో పడిపోయి ఫుల్లు బిజీ అయిపోయాడు. ఆ సినిమా సరైన విజయం సాధించి బన్నీ కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలవడంతో, ఆ జోష్ లో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు. తన బెటర్ హాఫ్ స్నేహా రెడ్డితో కలిసి టర్కీ చెక్కేశాడు. రీసెంట్ గా హైదరాబాద్ లోని టర్కీ ఎంబసీలో అల్లు అర్జున్ వీసా తీసుకున్న సంగతి తెలిసిందే. తమ ఇద్దరికీ టూరిస్ట్ వీసాలు తీసుకుని చక్కగా టర్కీ ఫైటెక్కేశాడు బన్నీ. టర్కీ టూరిజానికి బాగా ఫ్యామస్. వైవిధ్యానికి, ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. అందుకే ఆ నగరాన్ని ఎంచుకున్నారు బన్నీ వారు. ప్రస్తుతం బన్నీ, స్నేహ కలిసి ఇచ్చిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పేరుకు తగ్గట్టే స్టైలిష్ స్టార్ డ్రస్సింగ్ ఉంది. ఇంకొన్నాళ్ల పాటు టర్కీలో లైఫ్ ఎంజాయ్ చేసి తిరిగి వచ్చిన తర్వాత లింగుస్వామి ప్రాజెక్ట్ ను మొదలెడతాడట స్టైలిష్ స్టార్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



