యూట్యూబ్ ఛానల్ ఆఫీస్‌పై అల్లు అర్జున్ అభిమానుల దాడి..!
on Nov 11, 2024
గత కొంతకాలంగా అల్లు అర్జున్‌కి సంబంధించిన వివిధ అంశాలమీద విశ్లేషణ జరిపిన ఓ యూట్యూబ్ ఛానల్ వీడియోస్‌కి ఉపయోగించే థంబ్ నెయిల్స్ విషయంలో హద్దుమీరి ప్రవర్తించారని ఫాన్స్ ఆగ్రహించారు. ఛానల్‌కి సంబంధించిన ఆఫీస్‌కి చేరుకున్న అల్లు అర్జున్ అభిమానులు ఛానల్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసంతృప్తిని తెలియజేసారు. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చేరుకోవటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఛానల్ యాజమాన్యానికి, ఫ్యాన్స్‌కి భారీ స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే ఇలాంటి తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ శాంతించారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇంత ఆగ్రహానికి గురైన విషయం ఏమిటంటే.. అతనికి సంబంధించిన ఓ స్టోరీని పోస్ట్ చేస్తూ ‘హాస్పిటల్‌లో అల్లు అర్జున్.. పరిస్థితి విషమం’గా థంబ్ నెయిల్ పెట్టారు. బన్ని ఫ్యాన్స్ ఇంత ఆగ్రహానికి గురి కావడానికి, సదరు ఛానల్‌పై దాడి చేయడానికి ప్రధాన కారణం ఇదే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



