అల్లు అర్జున్ పై బిజెపీ ఎంఎల్ఏ రాజాసింగ్ సంచలన ట్వీట్
on Dec 13, 2024
.webp)
పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు,ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాలు పాలవడానికి కారణమయ్యాడనే కారణంతో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనకీ గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది.ఇక ఈ కేసులో అల్లు అర్జున్ తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వెయ్యగా సాయంత్రం నాలుగు గంటలకు విచారిస్తామని, అరెస్ట్ చేసిన విధానంపై కూడా వాదనలు కూడా వింటామని హైకోర్టు వెల్లడించింది
ఇక ఈ కేసుపై గోషామహల్ ఎంఎల్ఏ రాజా సింగ్(raja singh)సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ తొక్కిసలాటలో మహిళా చనిపోవడం అనే విషాదకర సంఘటనకి పోలీసు శాఖ యొక్క వైఫల్యం కారణమే గాని, జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ తప్పు కాదు. తన ప్రశంసలు మరియు విజయాలతో తెలుగు రాష్ట్రాలకు ఎనలేని గర్వం తెచ్చారు. నేరుగా బాధ్యత వహించని దానికి,ఆయన్ని జవాబుదారీగా ఉంచడం అన్యాయం మరియు అసమంజసమైనది.క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లోని దైహిక సమస్యలు మరియు లోపాలను పరిష్కరించడానికి బదులుగా, ప్రముఖ వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకోవడం పరిపాలనపై చెడుగా ప్రతిబింబిస్తుంది.
ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి మరియు జవాబుదారీతనం నిజంగా ఎక్కడ ఉందో, ప్రజా భద్రతను కాపాడే బాధ్యత కలిగిన వారితో నిర్ధారించుకోవాలని ట్వీట్ చెయ్యడం జరిగింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



