Home

»

Latest News

AA22: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!

Mar 31, 2026

  • బన్నీ బర్త్‌డే స్పెషల్ 
  • ఏప్రిల్ 8న రాబోతున్న 'AA22' అప్‌డేట్!
  • ఫ్యాన్స్ ఆశించినట్లుగా గ్లింప్స్ ఉంటుందా? 
  • కేవలం టైటిల్ పోస్టర్‌తోనే సరిపెడతారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తన 22వ సినిమా 'AA22'ను కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. అయితే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ విడుదలవుతుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, వారికి నిరాశే ఎదురుకానుందని తెలుస్తోంది.

అల్లు అర్జున్ బర్త్ డేకి 'AA22' గ్లింప్స్ విడుదల లేనప్పటికీ, మరో సర్‌ప్రైజ్ ఉందని సమాచారం. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'పుష్ప'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన బన్నీ, అట్లీతో జతకట్టడం అనేది ఒక భారీ సినీ సంబరం కానుంది. అయితే, అభిమానులు బన్నీ బర్త్ డేకి ఒక పవర్-ప్యాక్డ్ వీడియో గ్లింప్స్ వస్తుందని ఆశపడ్డారు. కానీ, ప్రస్తుత సమాచారం ప్రకారం అట్లీ టీమ్ కేవలం టైటిల్ పోస్టర్‌తోనే సరిపెట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. వీడియో కంటెంట్ కోసం అభిమానులు మరికొంత కాలం వేచి చూడక తప్పదని తెలుస్తోంది.

ఏదేమైనా, రిలీజ్ చేయబోయే ఆ టైటిల్ పోస్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని అంటున్నారు. అట్లీ సినిమాలు అంటేనే విజువల్ వండర్స్. అలాంటిది ఐకాన్ స్టార్‌తో సినిమా అంటే, అది ఏ రేంజ్ విజువల్ స్పెక్టాకిల్‌గా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాలో బన్నీ మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపిస్తారని టాక్.

ఈ సినిమాలో బన్నీ సరసన దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ కాస్ట్ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇప్పటి వరకు ఈ సినిమా అడుగులు ఎంతో సైలెంట్ గా, అదే సమయంలో ఎంతో పవర్‌ఫుల్‌గా సాగుతున్నాయి. సాయి అభ్యంకర్ సంగీతం ఈ సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఏప్రిల్ 8న రాబోయే టైటిల్ పోస్టర్ తో సినిమా ఎలా ఉండబోతోందో ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. ఎప్పటిలాగే బన్నీ బర్త్‌డే వేడుకలకు ఈ టైటిల్ పోస్టర్ అదనపు కిక్ ఇవ్వడం ఖాయం. ఆ రోజు కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

Also Read: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఎన్టీఆర్.. 'దేవర 2' షూటింగ్ స్టార్ట్ డేట్ ఫిక్స్..!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com