Home

»

Gossips

Devara 2: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఎన్టీఆర్.. 'దేవర 2' షూటింగ్ స్టార్ట్ డేట్ ఫిక్స్..!

Mar 31, 2026

  • 'దేవర 2' లేటెస్ట్ అప్‌డేట్
  • మ్యూజిక్ సిట్టింగ్స్‌లో అనిరుధ్ బిజీ
  • డేట్స్ ఇచ్చిన ఎన్టీఆర్
  • షూటింగ్ ఎప్పుడంటే..?

'దేవర 2' ఉంటుందా లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నలా మారింది. ఒకసారి ఉంటుందని, మరోసారి ఉండదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా మరోసారి 'దేవర 2' తెరపైకి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ఈ సినిమాకి డేట్స్ కేటాయించాడని, షూటింగ్ డేట్ కూడా లాక్ అయిందని న్యూస్ వినిపిస్తోంది. (Devara Part 2)

'దేవర: పార్ట్ 1' కమర్షియల్ సక్సెస్ సాధించినప్పటికీ, కంటెంట్ పరంగా మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. అందుకే 'దేవర 2' ఉండకపోవచ్చనే అనుమానాల వ్యక్తమయ్యాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం ఖచ్చితంగా 'దేవర 2' ఉంటుందని చెబుతూ వచ్చాడు. అందుకు తగ్గట్టే తాజాగా డేట్స్ కూడా ఇచ్చినట్లు వినికిడి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'దేవర 2' షూటింగ్‌కు సంబంధించి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. తారక్ ఈ ప్రాజెక్ట్ కోసం డేట్స్ కేటాయించాడని, అక్టోబర్ మూడో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేశారు. రెండో భాగంలో యాక్షన్ సీక్వెన్స్‌లు అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతున్నాయని, అందుకే ఈసారి ప్లానింగ్ చాలా పకడ్బందీగా చేస్తున్నారని తెలుస్తోంది. 

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయట. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఇప్పటికే కొన్ని అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేశాడని, ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని వినికిడి.

ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న 'డ్రాగన్' (Dragon) సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ 40 శాతానికి పైగా అయిందని టాక్. అక్టోబర్ నాటికి ఈ మూవీ షూటింగ్ పూర్తవుతుందేమో చూడాలి. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు ఉంది. ఆ రోజు 'డ్రాగన్'తో పాటు 'దేవర 2' అప్డేట్ వచ్చే అవకాశముంది.

'దేవర' మొదటి భాగం సముద్ర నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ నటన, అనిరుధ్ సంగీతం సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. రెండో భాగంలో 'దేవర' మరియు 'వర' పాత్రల మధ్య ఘర్షణ మరింత తీవ్రంగా ఉంటుందని, ఫస్ట్ పార్ట్‌లో మిగిలిపోయిన చిక్కుముడులన్నీ ఈ సీక్వెల్‌లో వీడతాయని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com